కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులను విస్మరించారు:గిద్దె రాజేష్

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్ నిధులు కేటాయించకుండా విస్మరించడాని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్లలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు.

ఈ సందర్బంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ వికలాంగులకు నిరాశను మిగిల్చితే,రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క వికలాంగులకు భరోసా లేకుండా చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం వికలాంగుల సాధికారతకు 2024-25 బడ్జెట్లో 1225.27 కోట్లు కేటాయించిది.

గత బడ్జెట్ తో పోల్చితే 0.02 శాతం పెంచింది.

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్ లో 5శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నా,వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615.

33కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు.దీన్ దయాల్ వికలాంగుల పునరావాస పథకాన్ని అర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు మాత్రం పెంచలేదన్నారు.

ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో 5 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటే ఒక్క పైసా కూడా కెటాయించకుండా వికలాంగులను చిన్నచూపు చూసిందన్నారు.

అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.6000 పెంచుతామని చెప్పిన ప్రభుత్వం,బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేకపోవడం దురదృష్టకరమన్నారు.

ఈ కార్యక్రమంలోసంఘం మండల అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు,జిల్లా యూత్ నాయకులు గుంటి శివ, మహిళా నాయకురాలు గోగుల పద్మ తదితరులు పాల్గొన్నారు.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?