గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం..!

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.అనారోగ్య కారణాల వలన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారని సమాచారం.

ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో తాను బరిలో ఉండటం లేదని వెల్లడించారు.గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎవర్ని నిలబెట్టినా గెలిపించుకుందామని పార్టీ క్యాడర్ కు అన్నా రాంబాబు పిలుపునిచ్చారు.

అదేవిధంగా తాను టీడీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.

విమానం ఇంజన్‌లోకి దూసుకెళ్లిన పక్షి.. చివరికి ఏమైందో చూడండి..