వావ్, ఈ తేనెతెట్టపై అలల సృష్టిస్తున్న తేనెటీగలు.. వీడియో చూస్తే ఫిదా!
TeluguStop.com

పుష్పించే మొక్కలను పరాగసంపర్కం చేయడంలో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తాయి.ఇవి పూల నుంచి మకరందం సేకరించి తేనె తయారుచేస్తాయి.


ఈ తేనెను తేనెతెట్ట లేదా తేనెగూడులో భద్రంగా దాచుకుంటాయి.ఎవరైనా ఆ తెట్టెను కదిలిస్తే చాలు అవి వెంటనే విచక్షణారహితంగా కుట్టేస్తాయి.


మనుషుల ప్రాణాలను తీయగల శక్తి కూడా వీటికి ఉంది.అందుకే మనుషులు వీటిని కదిలించేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు.
ఆ జాగ్రత్తలు పాటించలేని సింహాలు, పులులు ఇతర జంతువులు ఈ తేనె జోలికి వెళ్ళవు.
కుట్టడం మాత్రమే కాదు ఇవి తమ తేనె తినేయాలని చూస్తున్న ఇతర జీవులను భయపెట్టడానికి మరో పని కూడా చేస్తాయి.
అదేంటంటే, తేనెటీగలు అలల లాంటి ఒక దృశ్యాన్ని గూడుపై సృష్టించడానికి తమ పొత్తికడుపులను ఒకేసారి పైకి తిప్పుతాయి.
తద్వారా వాటి తుట్టెలపై అలలు ఎగిసి పడినట్లు అనిపిస్తుంది.ఈ దృశ్యం జంతువులను భయపెడుతుంది.
అలా అవి తమ తేనెను కాపాడుకుంటాయి.ఇలా చేయడాన్ని శాస్త్రవేత్తలు షిమ్మరింగ్ అని పిలుస్తారు.
కాగా తాజాగా సంబంధించిన వీడియో ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసారు.
అది కాస్త వైరల్ గా మారింది. """/"/
ఈ వీడియోను ఫ్యాసినేటింగ్ అనే ట్విట్టర్ పేజీ రీషేర్ చేసింది.
"పెద్ద తేనెటీగలు తమ గూడును వేటాడే జంతువుల నుంచి "షిమ్మరింగ్" అని పిలిచే రిప్పల్ ఎఫెక్ట్ తో రక్షిస్తాయి.
" అని ఈ వీడియోకి ట్విట్టర్ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.ఇది చూసిన నెటిజన్లు ఈ దృశ్యం అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోకి ఇప్పటికే 69 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని మీరు కూడా చూసేయండి.