ఐదేళ్ల తర్వాత కనిపించిన దెయ్యం నౌక.. ఏం జరిగిందంటే?

ఐదేళ్ల క్రితం ఆ నౌక కనిపించకుండా పోయింది.ఇన్నేళ్ల పాటు ఏమైందో ఎవరికీ తెలియదు.

అందులో ఉన్న వాళ్లు కూడా ఏమయ్యారో ఎలాంటి సమాచారమూ లేదు.ఆ నౌక కనిపించకుండా పోయి సంవత్సరాలు గడుస్తుండటంతో దాని గురించి అంతా మర్చిపోయారు.

కానీ తాజాగా ఆ నౌక రాడార్లకు చిక్కింది.దాన్ని చూసిన వాళ్లు ముందుగా అది దెయ్యం నౌక కావొచ్చని భావించారు.

ఎప్పుడో కనిపించకుండా పోయిన నౌక ఇప్పుడెలా కనిపిస్తోందంటూ ఆందోళన చెందారు.అయితే అది నిజంగానే దెయ్యం నౌకనా.

అందులో ఆత్మలు, దెయ్యాలే ఉన్నాయా అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తర కొరియాకు చెందిన ఓ నౌక ఐదేళ్ల కిందట సముద్రంలో మిస్ అయింది.

దాని పేరు దాయ్ బాంగ్ 1.అయితే ఇది చాలా పెద్ద వాణిజ్య నౌక.

మొత్తం 3,800 చన్నుల బరువు ఉండే ఈ నౌక 2017లో కనిపించకుండా పోయింది.

తాజాగా ఈ ఏడు జులైలో రాడార్లకు చిక్కింది.మరి ఆ ఐదేళ్లూ ఆ నౌక ఏమైపోయింది.

ఇంటర్నేషనల్ మారీటైన్ కన్వెన్షన్ ప్రకారం.వాణిజ్య నౌకలన్నీ తమ లొకేషన్ తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది.

ఇందుకోసం ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం అనేది ఉంటుంది.ఇది ప్రతీ నిమిషం పని చేస్తూనే ఉంటుంది.

ప్రపంచంలోని వాణిజ్య నౌకలన్నీ ఎప్పుడు ఎక్కడున్నది చూపిస్తుంది.అయితే ఈ లిస్ట్ నుంచి దాయ్ బాగ్ 1 తప్పించుకుంది.

చైనా నగరం కావోఫిడియన్ సముద్ర జలాల్లో వెళ్తూ మాయమైంది.అయితే దాని పేరు మార్చి డూప్లికేట్ ప్రొఫైల్ తో ఎవరైనా దాన్ని తిప్పి ఉండవచ్చని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్ స్టిట్యూట్ కి సంబంధించిన పరిశోధకుడు జేమ్స్ బిర్నే అంచనా వేశారు.

ఐఐటీలో సీటు సాధించిన గిరిజన బిడ్డ నవ్య.. ఈమె సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!