ఘోస్ట్ రైడర్.. జనాల మీదికి దూసుకెళ్లిన మంటల్లో కాలుతున్న కారు.. వైరల్ వీడియో
TeluguStop.com
దేశవ్యాప్తంగా ప్రతిరోజు రోడ్లపై అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడం సర్వసాధారణం అయిపోయింది.
ఒక్కోసారి మన తప్పు లేకపోయినా ఎదుటివారు వచ్చే విధానాన్ని బట్టి అనేక రోడ్డు ప్రమాదాలు కూడా సంభవించిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
ఇలా రోడ్డు ప్రమాదాలలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణా నష్టం కూడా జరుగుతూ ఉంటాయి.
వాటిలో కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
అచ్చం అలాంటి సంఘటన ఒకటి జైపూర్ (jaipur) కారు ప్రమాదం.ప్రముఖ ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ క్రమంలో కార్లో ఉండే డ్రైవర్ కారులో నుంచి బయటకు దూకేశాడు.ఆ తర్వాత కారు ఎదురుగా ఉన్న వాహనాలకు రావడంతో అక్కడ ఉన్నవారు అందరూ వాహనాలను అక్కడే వదిలేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. """/" /
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా రాజస్థాన్ రాజధాని జైపూర్ (jaipur)లో ఈ కారు ప్రమాదం సంబంధించినట్లు తెలుస్తుంది.
సోడాలా సబ్జీ మండి ప్రాంతం నుంచి సుదర్శన్ పురా పులియా వైపు ఒక కారు వెళ్తుండగా మ.
అజ్మీర్ రోడ్ లోని ఎలివేటర్ ఫ్లైఓవర్ మీదకు చేరుకోగానే కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇది గమనించిన కార్ డ్రైవర్ వెంటనే కారులో నుంచి బయటకు దూకేశాడు.ఫ్లై ఓవర్ మీదనే కారు మంటలతో కాలిపోవడం అందరూ చూశారు.
అంతేకాకుండా కారు డ్రైవర్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా కారులో ఏమైనా అని కాపాడేందుకు ప్రయత్నాలు కూడా చేశారు.
ఈ క్రమంలో ఫ్లైఓవర్ కింద వైపు కదిలి మంటలతో దూసుకు వచ్చింది తోటి వాహనాల వైపుకు.
"""/" /
ఆ కారు రావడంతో కొందరు బైకులు, కార్లు (bikes, Cars) తీసుకొని అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేశారు.
అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైఓవర్ పై ఎక్కువ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఇక విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలు ఆర్పి కారులో పక్కకు పెట్టారు.
వాస్తవానికి కారు ఇంజన్లో ఏదో సమస్య కారణంగానే ఇలా మంటలు చెలరేగాయని డ్రైవర్ తెలియజేశాడు.
కారు ఇంజన్ లో ఏదో సమస్యగా ఉన్నట్లు అనిపించిందని ఫ్లై ఓవర్ మీదికి రాగానే కార్లో పొగలు వచ్చాయని వెంటనే కారులో నుంచి బయటికి దూకేసానని.
నేను దూకిన కాసేపటికి మంటలు ఒక్కసారిగా చిల్లరేగిన డ్రైవర్ తెలియజేశాడు.ఇక అలాగే కార్లో చెలరేగిన మంటల సంఘటన విషయాన్ని కాస్త ఆ కారు కంపెనీ దృష్టికి తీసుకుని వెళ్ళాడు బాధితుడు.
దాంతో ప్రతినిధులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
బన్నీని చూసి ఎన్టీఆర్ నేర్చుకోవాలా.. ప్రమోషన్స్ విషయంలో ఫాలో కావాల్సిందేనా?