జీహెచ్ఎంసీ ఎన్‎ఫోర్స్‎మెంట్ కీలక నిర్ణయం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్‎ఫోర్స్‎మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.నగరంలో ఉన్న చెట్లపై పోస్టర్లు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

జీహెచ్ఎంసీలో చెట్లకు టూ లెట్ బోర్డులు పెట్టడంపై భారీగా జరిమానాలు విధించారు.ఈ క్రమంలోనే జగద్గిరిగుట్టలో ఓ డిజైనర్స్ కు రూ.

8 వేల పెనాల్టీ విధించారు.ట్విట్టర్ వేదికగా వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈవీడీఎం చర్యలు తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఎవరైనా చెట్లకు పోస్టర్లు కానీ, టూలెట్ బోర్డులు కానీ అమర్చితే కఠిన చర్యలు తప్పవని వెల్లడించింది.

అయితే సిటీలో ఎక్కడ ఏ చెట్టు చూసిన వివిధ రకాల పోస్టర్లు, టూ లెట్ బోర్డులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.