నెయ్యితో ఇలా చేస్తే.. నిద్ర‌లేమి దూరం?

ఆరోగ్యంగా ఉండాల‌న్నా, ప్ర‌శాంతంగా ఉండాల‌న్నా మ‌న శ‌రీరానికి నిద్ర చాలా అవ‌స‌రం.అనేక జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంలోనూ నిద్ర అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అయితే నేటి ఆధునిక కాలంలో చాలా మందిని నిద్ర‌లేమి స‌మ‌స్య తెగ వేధిస్తోంది.

‌ఒత్తిడి, వ‌ర్క్ టెన్ష‌న్‌, మెటబాలిజం సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, ఆహార‌పు అల‌వాట్లు ఇలా ర‌క‌ర‌కాల కారణాల వల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

అలాగే ఆఫీసుల్లో గంట‌లు త‌ర‌బ‌డి వ‌ర్క్ చేసి.ఆ త‌ర్వాత బస్సుల్లో, రైళ్లలో జర్నీ చేసి ఇంటికి చేరేస‌రికి కాళ్ల‌ నొప్పులతో ఇబ్బందులు పడుతూ నిద్రకు దూరమవుతున్న వారు ఎంద‌రో ఉన్నారు.

అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి నిద్ర‌లేమికి చెక్ పెట్ట‌డంలో నెయ్యి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు.ప్రోటీన్స్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా నెయ్యిలో ఉంటాయి.

అటువంటి నెయ్యి నిద్ర‌లేమికి కూడా నివారించ‌గ‌ల‌దు. """/" / రాత్రి నిద్రించే రెండు లేదా మూడు గంటల ముందు నెయ్యిని అరచేతిలోకి తీసుకొని అరికాళ్లకు పూర్తిగా రుద్దాలి.

వేడిగా అనిపించేంత వరకు అరచేతితో.అరికాలును మర్ధన చేస్తూ ఉండాలి.

ఆ త‌ర్వాత చేతిలో మరి కొంచెం నెయ్యి వేసి.క‌ళ్ల చుట్టూ అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే చ‌క్క‌టి నిద్ర ప‌డుతుంది.మ‌రియు పాదాల‌ నొప్పులు కూడా త‌గ్గి.

మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇక మ‌రో విష‌యం ఏంటంటే.

నెయ్యిని క‌ళ్ల చుట్టు అప్లై చేయ‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌ట్ట‌డంతో పాటుగా క‌ళ్ల చుట్టు ఉండే డార్క్ స‌ర్కిల్స్ కూడా దూరం అవుతాయి.

కాబ‌ట్టి, డార్క్ స‌ర్కిల్స్ ఉన్న వారు.ప్ర‌తి రోజు నిద్రించే ముందు క‌ళ్ల చుట్టు నెయ్యి అప్లై చేసుకుంటే మంచిది.

ప్రభుత్వ పాఠశాలలో చదివి 593 మార్కులు.. త్రివేణి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!