హెయిర్ ఫాల్‌ను తగ్గించే నెయ్యి.. ఎలా ఉపయోగించాలంటే?
TeluguStop.com
హెయిర్ ఫాల్.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని కామన్‌గా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
ముఖ్యంగా యువతలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.మారిన జీవన శైలి, చుండ్రు, పొల్యూషన్, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇలా రకరకాల కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటారు.
హెయిర్ ఫాల్ అధికంగా ఉంటే.మానసికంగా కృంగిపోతుంటారు.
అందుకే హెయిర్ ఫాల్ సమస్యను ఎలాగైనా దూరం చేసుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు.
అయితే హెయిర్ ఫాల్‌ను తగ్గించడంలో నెయ్యి అద్భుతంగా సహాయపడుతుంది.మరి నెయ్యిని ఎలా కేశాలకు ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా రెండు లేదా మూడు స్పూన్ల నెయ్యి మరియు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.కాసేపు మసాజ్ చేసుకోవాలి.
ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసేయాలి.ఇలా వారినికి రెండు సార్లు చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
మరియు కేశాలకు పోషకాలు అంది.రాలడం తగ్గుముఖం పడుతుంది.
"""/" /
అలాగే రెండొవది.ఒక బౌల్‌లో స్వచ్ఛమైన నెయ్యి, టీ ట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.అరగంట లేదా గంట పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా చేడయం వల్ల హెయిల్ ఫాల్ తగ్గడంతో పాటు కేశాలను కాంతివంతంగా మారుతుంది.
ఇక కొబ్బరి నూనెకు బదులు.తలకు, జుట్టు కుదుళ్లకు నెయ్యిని అప్లై చేసి పావు గంట పాటు మసాజ్ చేసుకోవాలి.
అనంతరం తలస్నానం చేసేయాలి.ఇలా మూడు రోజులకు ఒకసారి చేయడం వల్ల.
నెయ్యిలో ఉంటే ప్రోటీన్లు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలడాన్ని తగ్గించి.
ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి.
రియల్ లైఫ్ లో నాన్నకు ముఫాసాతో పోలికలు.. సితార ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!