మోకాళ్లు, మోచేతులపై నలుపు పోవాలా? నెయ్యితో ఇలా చేయండి!
TeluguStop.com
నెయ్యి పేరు వింటేనే చాలా మందికి నోరూరుతుంటుంది.ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండే నెయ్యిని పిల్లలే కాదు పెద్దలు కూడా తెగ ఇష్టపడుతుంటారు.
పైగా బోలెడన్ని పోషకాలు నిండి ఉండటం వల్ల నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్యానికేనా.చర్మ రక్షణలోనూ, కేశ రక్షణలోనూ నెయ్యి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా కొందరికి మోకాళ్లు, మోచేతులపై నల్లగా మారుతుంది.ఆ నలుపును వదిలించుకునేందుకు ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.
కానీ, ఈ సమస్యను నెయ్యి సులభంగా నివారించగలదు.మరి నెయ్యిని ఎలా వాడాలి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి, రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై అప్లై చేసుకుని సర్కిలర్ మోషన్‌లో బాగా మర్దనా వేసుకోవాలి.
అనంతరం బాగా డ్రై అవ్వనిచ్చి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే నలుపు పోయి చర్మం తెల్లగా, మృదువుగా మారుతుంది.
"""/" /
అలాగే ఒక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి, ఒకటిన్నర స్పూన్ ఆలు గడ్డ రసం వేసుకుని కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లకు పట్టించాలి.కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని.
పావు గంట తర్వాత మంచి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే మోచేతులు, మోకాళ్లు తెల్లగా మెరిసిపోతాయి.
ఇక ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి, అర స్పూన్ తేనె మరియు ఒకటిన్నర స్పూన్ షుగర్ వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెకాళ్లపై, మోచేతులపై పూసి స్క్రబ్ చేసుకోవాలి.ఆ తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
ఇలా చేసినా కూడా నలుపు వదులుతుంది.
వార్ 2 లో ఎన్టీయార్ ఎంత సేపు కనిపిస్తాడు..?