విదేశీ ఉద్యోగాల పేరుతో ఉత్తరాంధ్రలో ఘరానా మోసం..!
TeluguStop.com
ఇటీవలే కాలంలో వెలుగులోకి వస్తున్న ఘరానా మోసాలలో.ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిలువునా ముంచేసి దారుణంగా మోసం చేసే ఘటనలే అధిక సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి.
స్వీడన్( Sweden ) లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమృత్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ( Amrit Enterprises Company )నిరుద్యోగుల నుండి దొరికినంత వరకు దోచుకుని చివరికి నట్టేట ముంచేసింది.
ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా రాయలసీమ జిల్లాలకు చెందిన సుమారుగా 70 మంది నిరుద్యోగుల నుంచి రూ.
కోటి వరకు వసూలు చేసుకుని బోర్డు తిప్పేసింది.దీంతో మోసపోయిన బాధిత నిరుద్యోగులు సోమవారం విశాఖపట్నం లోని నాలుగవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
"""/" /
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.దొండపర్తి లోని టీఎస్ఎన్ కాలనీలో అమృత్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ నుండి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం చాలా వైరల్ అయింది.
ఎంతోమంది నిరుద్యోగులు అది నిజమే అని నమ్మి కార్యాలయానికి ఫోన్ చేస్తే.అర్హతకు తగ్గ ఉద్యోగాలు ఇప్పిస్తామని, కాకపోతే అందుకోసం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని సంస్థ మేనేజర్లు శాంతి, లలిత నమ్మించారు.
ఈ సంస్థను నీరజ్, సౌరబ్( Neeraj, Saurabh ) అనే వ్యక్తులు వెనుకనుండి నడిపిస్తూ.
విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం, కడప, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నిరుద్యోగుల నుంచి రూ.
లక్ష, రూ.2లక్షలు చొప్పున రూ.
కోటి వరకు ఆన్లైన్ రూపంలో వసూలు చేశారు. """/" /
సొమ్ము చెల్లించిన నిరుద్యోగులకు రసీదులతో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్లను సంస్థ మేనేజర్లు అందించారు.
కానీ ఎన్ని రోజులు గడిచిన ఉద్యోగం రాకపోవడంతో కొంతమంది నిరుద్యోగులు దొండపర్తి లో ఉండే అమృత్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు వెళ్లారు.
అక్కడ కార్యాలయం మూసి ఉండడంతో సంస్థ బోర్డు తిప్పేసిందని, తాము మోసపోయామని గ్రహించిన బాధితులంతా నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెన్నలా కరిగిపోవాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!