మేడ్చల్ జిల్లాలో వెలుగులోకి ఘరానా మోసం

మేడ్చల్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.ఫీర్జాదిగూడలో గోల్డ్ కాయిన్ స్కీమ్ పేరుతో కేటుగాళ్లు టోకరా వేశారు.

ఈ క్రమంలో జన జాగరణ సమితి ట్రస్ట్ పేరుతో రూ.10 కోట్లు కాజేశారని సమాచారం.

రూ.లక్ష కడితే రూ.

2.70 లక్షలు ఇస్తామంటూ మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

కాగా ట్రస్ట్ శ్రీకాంత్ జిన్నా అనే యువకునికి చెందినదిగా గుర్తించిన బాధితులు గతంలోనూ ఉప్పల్ లో పల్లీకాయల మిషన్ల నుంచి నూనె తీసి అమ్మితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసగించినట్లు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే జన జాగరణ సమితి ట్రస్ట్ ముందు బాధితులు నిరసనకు దిగారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నా మనవరాలిని చూసిన ఆనందం సంపాదనలో కనిపించలేదు.. సునీల్ శెట్టి ఎమోషనల్ కామెంట్స్!