కీలకంగా మారిన స్టేషన్ ఘన్ పూర్..రాజయ్య మాటల వెనుక ఆంతర్యమేంటో..?

స్టేషన్ ఘన్పూర్( Station Ghanpur) నియోజకవర్గ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు( Ajaiah ) ఈసారి కేసీఆర్ టికెట్ కేటాయించలేదు.

దీంతో బంగపడిన రాజయ్య గత కొంతకాలంగా నైరాశ్యంలో ఉన్నాడు.అంతేకాకుండా నియోజకవర్గంలో తాను కూడా ప్రచారం చేస్తూ, టికెట్ నాకే వస్తుందని భరోసాతో ఉన్నారు.

అలాంటి ఈ తరుణంలో రాజయ్యకు తెలంగాణ రైతుబంధు చైర్మన్ గా( Raithu Bandhu Chairman ) పదవి ఇవ్వడంతో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఇక రాదనే విషయం కన్ఫామ్ అయిపోయింది.

అయితే తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జనగామ( Janagama ) జిల్లాలోని కేశవ నగర్ గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి వెళ్లారు.

ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే నేను నియోజకవర్గానికి రావలసిన అవసరం లేదని అన్నారు.

"""/" / ఇక్కడ డప్పు కొట్టాలన్న, ప్లెక్సీలు కట్టాలన్న భయపడిపోతున్నారని, ఎందుకు అంత అభద్రతాభావంతో ఉన్నారో అర్థం కావడం లేదని రాజయ్య(rajayya) అన్నారు.

జనవరి 17వ తేదీ వరకు నేను ఎమ్మెల్యేనని, అప్పటివరకు నా నియోజకవర్గానికి నేనే బాస్ అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా గత కొన్ని రోజులుగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరికి( Kadiyam Srihari ) మరియు రాజయ్యకు లోలోపల కాస్త వార్ నడుస్తోంది.

అంతేకాకుండా స్టేషన్ ఘన్పూర్ లో ఈసారి టికెట్ తప్పక కడియం శ్రీహరికే వెళుతుందని ప్రచారం సాగుతోంది.

"""/" / అంతేకాకుండా అసంతృప్తితో ఉన్న రాజయ్యకు తెలంగాణ రైతుబంధు చైర్మన్ ఆల్రెడీ ఖరారు చేశారు అధిష్టానం.

ఈ క్రమంలోనే రాజయ్య(rajayya) మీడియాతో మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి నేనే బాస్ అనే మాటలు చెప్పడం చుస్తే ఆయన చివరి సమయం వరకు ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ఇంకేదైనా పార్టీ టికెట్ ఆఫర్ ఇస్తే అందులోకి వెళ్తారా లేదంటే బీఆర్ఎస్( Brs ) ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు చైర్మన్ గా కొనసాగుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

ఢిల్లీ మెట్రోలో యువతి ఓవరాక్షన్.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..