ఆ సినిమా స్పూర్తితో 'గని' పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుందా?
TeluguStop.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రెజెంట్ నటిస్తున్న సినిమా గని.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
ఈ సినిమా లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
గని సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.
ఇటీవలే ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.కానీ అప్పుడు కూడా వాయిదా వేశారు.
అయితే ఈ సినిమా ఆలస్యానికి కారణం ఏంటి అని ఇప్పుడు ఒక డిబేట్ నడుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. """/"/
గని సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని వార్త బయటకు వచ్చింది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ లు కూడా ఉన్నారు.అలాగే విదేశీ టెక్నీషియన్స్ సైతం ఈ సినిమా కోసం పని చేసారు.
అలాగే ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ కూడా నిర్మాతగా పరిచయం అవుతున్నాడు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఉత్తరాదిన పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ ఉన్న కారణంగానే ఈ సినిమా వాయిదా పడింది అని టాక్.
ఇటీవలే రిలీజ్ అయిన పుష్ప ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా సక్సెస్ తో అల్లు అరవింద్ కూడా అడుగు ముందుకు వేసినట్టు చెబుతున్నారు.
షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!