ఆనందయ్య మందు పై క్లారీటి ఇచ్చిన జీజీహెచ్ కోవిడ్ నోడల్ ఆఫీసర్.. ఆ ప్రచారానికి బ్రేక్ .. !
TeluguStop.com
నలుగురి మేలు కోరేవారికి ఎప్పుడు కష్టాలు పిలవని పేరంటానికి వచ్చిన చుట్టాలుగా వెంటే ఉంటాయంటారు.
ఈ సమాజంలో మంచి చేసే వారు ఉండేదే చాలా తక్కువ.అందులో వారినే కష్టాలు జలగల్లా పీడీస్తే, మంచి చేయాలనుకునే వారు కూడా ఇలాంటి ఘటనల వల్ల వెనకడుగు వేస్తారు.
మొత్తానికి ఈ జనారణ్యంలో ఉన్న జనాలు అడవి మృగాలకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.అసలే కరోనా వరుసపెట్టి ప్రజలను కాటికి పంపిస్తుంటే అయ్యో పాపం అంటూ ఆనందయ్య కరోనా రోగుల పాలిట ఆపద్బాందవుడిగా మారాడు.
ఈ సమయంలో ఎవరికి కన్నుకుట్టిందో తెలియదుగానీ ఈ మందు పంపిణీ ఆపేశారు.అయితే ప్రజలకు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని మాత్రం జీజీహెచ్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ నరేంద్ర తెలిపారు.
అదేమంటే ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్నవారిలో చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడినట్టు జరిగిన ప్రచారం అబద్దమని, అసలు నెల్లూరులోని జీజీహెచ్ లో ఇలాంటి వారు ఎవరు చికిత్స పొందడం లేరని కాస్త క్లారిటీ ఇచ్చారు.
మచ్చలేని కాంతివంతమైన చర్మం కోసం ఈ రెమెడీని ట్రై చేయండి..!