ప్రజలకు మెసేజ్ ఇచ్చిన గెటప్ శ్రీను.. పోలీసులు కూడా?

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమున్న పేరే.జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొంది తన కామెడీతో, గెటప్ లతో బాగా పేరు సంపాదించుకున్నాడు శ్రీను.

అంతేకాకుండా వెండితెర లో కూడా అవకాశాలను పొందాడు.జబర్దస్త్ నుండి వెండితెరకు పరిచయమై తన సొంత టాలెంట్ నిరూపించుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రజలకు ఒక మెసేజ్ అందించాడు.గెటప్ శ్రీను సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.

ఇక ప్రస్తుతం జరుగుతున్న కొన్ని నేరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచి మెసేజ్ ను అందించాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్ల ఫ్రాడ్ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది.గిఫ్ట్ అందిందని, ఇంత డబ్బు ఇస్తామని.

పలురకాల ఆఫర్లతో మెసేజ్ లేదా కాల్స్ ద్వారా అమాయక ప్రజలను నమ్మించి.వారి బ్యాంకు ఖాతాల ఆధారాలను మొత్తం సేకరించి.

వ్యక్తిగత వివరాలు సేకరించి బ్యాంకులో ఉన్న సొమ్మును మొత్తాన్ని కాజేస్తున్నారు. """/"/ దీనిని దృష్టిలో పెట్టుకుని గెటప్ శ్రీను.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ పి రవీంద్ర ప్రసాద్ తో సైబర్ నేరగాళ్లు చేసే మోసాన్ని గురించి ఒక కథ ద్వారా అందించారు.

అందులో గెటప్ శ్రీను తన ఇల్లు అమ్మకానికి కోసం సోషల్ మీడియాలో ఉన్న అమ్మకపు సైట్లలో పోస్ట్ చేశానని అనడం.

వెంటనే ఆయనకు సైబర్ నేరగాళ్లు నుండి ఫోన్ రావడం.మామూలు వ్యక్తుల మాట్లాడి బ్యాంకు డీటెయిల్స్ తీసుకొని ఉన్న మొత్తం డబ్బును కాజేయడం వంటివి.

సీఐ, గెటప్ శ్రీను ప్రజలకు అవగాహన కల్పించడానికి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజనులు మంచి విషయం తెలిపారని అభినందిస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!