ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే తొక్కేస్తారా.. గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కోసం జబర్దస్త్ కమెడియన్ లు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే గెటప్ శీను సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ అలాగే హైపర్ ఆది లాంటి వారు పవన్ కళ్యాణ్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారాలు కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా గెటప్ శీను( Getup Srinu ) హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమా( Raju Yadav Movie ) ట్రైలర్ నేడు లాంఛ్ అయింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకి గెటప్ శీను సమాధానమిచ్చాడు.
"""/" /
పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేశారు కదా ఒకవేళ మళ్లీ వైసీపీకే అధికారం వస్తే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అంటూ గెటప్ శీను ఒక రిపోర్టర్ ప్రశ్నించారు.
దీనికి సమాధానమిస్తూ యాంకర్ శ్యామల( Anchor Shyamala ) ఇంటర్వ్యూను ప్రస్తావించాడు శీను.
ఈ మధ్య యాంకర్ శ్యామల గారికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చూశాను.అందులో ఆమెను ఇలాంటి ప్రశ్నే అడిగారు.
ఈరోజు మీరు ఇలా వైసీపీకి ప్రచారం చేయడం వల్ల రేపు మీకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ ఏమైనా మీకు ఇవ్వకపోవచ్చేమో అన్న ప్రశ్నకి ఆమె కరెక్ట్‌గా సమాధానమిచ్చారు.
"""/" /
ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీళ్లని ఆపేద్దాం, తొక్కేద్దాం అనుకోవడం నిజంగా పరిణితి చెందిన ఆలోచన కాదు అనేది నా అభిప్రాయం అంటూ గెటప్ శీను సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా గెటప్ శీను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఇదే కార్యక్రమంలో ఏపీ మంత్రి రోజా( AP Minister Roja ) చేసిన కామెంట్లపై కూడా శీను రియాక్ట్ అయ్యాడు.
మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే వారు ప్రచారం చేస్తున్నారని రోజా చేసిన కామెంట్లకి నవ్వుతూ బదులిచ్చాడు శీను.
మెగా ఫ్యామిలీతో నేను ఎన్ని సినిమాలు చేశానో మీకు తెలుసు.అలానే వెంకటేశ్, ఎన్టీఆర్, నాని లతోనూ నేను కలిసి నటించాను.
కనుక ఇతర హీరోల చిత్రాల్లోనూ నాకు ఆఫర్లు వస్తున్నాయి కదా.మేము చిన్న వాళ్లమని మేడమ్ అన్నారు.
అలానే ఆవిడ కామెంట్లని కూడా మేము చిన్నగానే చూస్తున్నాం అంటూ గెటప్ శీను తెలిపారు.
కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. చిటికెలో తగ్గించే చిట్కాలు ఇవి!