అప్పట్లో విమానం చూస్తూ చిరంజీవి అని అరచిన గెటప్ శ్రీను.. సంస్కారమంటూ?

బుల్లితెర కమల్ హాసన్ గా పేరును సొంతం చేసుకున్న గెటప్ శ్రీనుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

గెటప్ శ్రీను నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.

టాలెంట్ ఉన్న నటీనటులను ప్రోత్సహించే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

రీఎంట్రీలో చిరంజీవి తను హీరోగా తెరకెక్కిన సినిమాలలో గెటప్ శ్రీనుకు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు.

అయితే గెటప్ శ్రీను తాజాగా చిరంజీవి గురించి చిరంజీవిపై తనకు ఉన్న అభిమానం గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాల్యంలో ఆకాశంలో ఎగిరెళ్లే విమానాన్ని చూసి చిరంజీవి బై అని గట్టిగా అరిచేవాడినని అప్పటినుంచి చిరంజీవిపై అభిమానాన్ని పెంచుకుంటూ పెరిగానని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.

ఎప్పటికైనా యాక్టర్ కావాలని చిరంజీవి గారితో ఫోటో దిగాలని నా సంకల్పం అని నాగబాబు గారి రూపేనా జబర్దస్త్ షో ద్వారా నా పేరు చిరంజీవి గారి దగ్గర వినిపించిందని గెటప్ శ్రీను తెలిపారు.

"""/"/ అప్పటినుంచి అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో చిరంజీవి నాకు ఛాన్స్ ఇస్తున్నారని గెటప్ శ్రీను వెల్లడించారు.

చిరంజీవిగారు ఆయన స్థాయి గురించి ఆలోచించకుండా ప్రైవేట్ జెట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నన్ను తీసుకెళ్లారని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.

అలా తీసుకెళ్లడం చిరంజీవి సంస్కారం అని ఆయనతో కలిసి ప్రైవేట్ జెట్ లో వెళ్లడం నిజమైన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని గెటప్ శ్రీను కామెంట్లు చేశారు.

గెటప్ శ్రీను వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గెటప్ శ్రీను జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చి ఆ షో ద్వారా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

గెటప్ శ్రీనును అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Tillu Square Movie : టిల్లు స్క్వేర్ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆ సీన్లు అభిమానులకు ఫుల్ కిక్కు ఇవ్వడం ఖాయమా?