గెటప్ శ్రీను రీ ఎంట్రీ జబర్దస్త్ కి ఏమైనా కలిసొచ్చిందా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను కూడా అందుకొని సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుధీర్ అండ్ టీం ఒకటి.

సుధీర్ టీమ్ లో ఎన్నో గెటప్స్ వేస్తూ బుల్లితెర కమల్ హాసన్ గా పేరు సంపాదించుకున్నారు గెటప్ శ్రీను.

ఇలా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఈ విధంగా గెటప్ శ్రీను జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో ఈయన బాటలోనే సుదీర్ వంటి వాళ్ళు కూడా బయటకు వెళ్లిపోయారు.

ఈ విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమెడియన్స్ ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

ఇక జబర్దస్త్ కార్యక్రమం పని అయిపోయిందని త్వరలోనే ఈ కార్యక్రమం ముగుస్తుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

"""/"/ ఇకపోతే తాజాగా గత రెండు వారాల నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఊహించని విధంగా గెటప్ శ్రీను ఈ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అయితే జబర్దస్త్ కార్యక్రమానికి గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమ రేటింగ్స్ ఏమైనా పెరిగాయా ఈ కార్యక్రమానికి అతని రీఎంట్రీ ఏమైనా కలిసి వచ్చిందా అనే విషయానికి వస్తే.

గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్స్ పెరిగిపోయాయని అదేవిధంగా యూట్యూబ్ లో కూడా ఈయన స్కిట్ చూసే వారి సంఖ్య కూడా అధికమైందని తెలుస్తోంది.

ఇలా ఈ కార్యక్రమానికి రేటింగ్స్ రావడంతో అభిమానులు ఈ కార్యక్రమానికి గెటప్ శీను తిరిగి రావడంతో ఈ కార్యక్రమం కూడా పూర్వ వైభవం తెచ్చుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈయన లాగే సుధీర్ హైపర్ ఆది ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రియల్ మీ C65 స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!