ఈ సింపుల్ రెమెడీతో దృఢమైన ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి!
TeluguStop.com
జుట్టు ఒత్తుగా దృఢంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.కానీ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, పోషకాల కొరత, ఒత్తిడి, తలస్నానం సమయంలో చేసే పొరపాట్లు, కురుల సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్ల హెయిర్ బలహీనంగా( Weak Hair ) మారడం, అధికంగా రాలడం, పల్చగా తయారవడం వంటివి జరుగుతుంటాయి.
అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టే అద్భుతమైన హోమ్ రెమెడీ ఒకటి ఉంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు,( Onions ) రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు( Ginger ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఉల్లి అల్లం జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ సీరం అనేది రెడీ అవుతుంది.
ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కనీసం పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.
"""/" /
సీరం అప్లై చేసుకున్న గంట తర్వాత తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ సీరంను తయారు చేసుకుని వాడారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
ఈ సీరం జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తుంది.హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ సమస్యలను అరికడుతుంది.
జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ఉల్లి, అల్లం, ఆముదం మరియు అలోవెరా చుండ్రు చికిత్సలో సహాయపడతాయి.
స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కు చెక్ పెడతాయి.ఆరోగ్యమైన దృఢమైన మరియు ఒత్తైన కురులను మీ సొంతం చేస్తాయి.
కాబట్టి తప్పకుండా ఈ న్యాచురల్ సీరంను ప్రయత్నించండి.
వెన్ను నొప్పికి కారణాలేంటి.. ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలి..?