ముఖంపై అస‌హ్యంగా క‌నిపించే తెల్ల‌టి మ‌చ్చ‌ల‌ను ఈజీగా మాయం చేసుకోండిలా!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖంపై న‌ల్లటి మ‌చ్చ‌ల మాదిరిగానే తెల్లటి మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి.ఇవి చ‌ర్మం రంగు కంటే తెల్ల‌గా, కాస్త‌ ఆస‌హ్యంగా క‌నిపిస్తుంటాయి.

ఈ తెల్ల‌టి మ‌చ్చ‌ల వ‌ల్ల అందం త‌గ్గ‌డ‌మే కాదు.మ‌న‌లోని ఆత్మ‌విశ్వాసం కూడా త‌గ్గిపోతుంది.

ఈ క్ర‌మంలోనే నలుగురితో క‌ల‌వాల‌న్నా, మాట్లాడాల‌న్నా వెన‌క‌డుగు వేస్తుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నాయా.

? అయితే చింతించ‌కండి.ఎందుకంటే ఇప్పుడు చెప్ప‌బోయే మ్యాజిక‌ల్ రెమెడీని ట్రై చేస్తే చాలా అంటే చాలా ఈజీగా ముఖంపై అస‌హ్యంగా క‌నిపించే తెల్ల‌టి మ‌చ్చ‌ల‌ను మాయం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ రెమెడీని ఎలా సిద్ధం చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం, ఐదు బాదం ప‌ప్పులు వేసుకుని వాట‌ర్‌తో ఒక‌టి లేదా రెండు సార్లు వాష్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత అర గ్లాస్ వాట‌ర్ పోసి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.మ‌రుస‌టి రోజు నాన‌బెట్టుకున్న బియ్యం, పొట్టు తొల‌గించిన బాదం ప‌ప్పుల‌ను వాట‌ర్‌తో స‌హా బ్లెండ‌ర్ లో వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి రైస్ బాదం మిల్క్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ మిల్క్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని మ‌చ్చ‌లు ఉన్న చోటు మాత్ర‌మే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఆర‌బెట్టుకోవాలి.

"""/" / పూర్తిగా డ్రై అయిన అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ రెమెడీని రోజుకు ఒక‌సారి గనుక పాటిస్తే.తెల్ల‌టి మ‌చ్చ‌లు క్ర‌మంగా మాయం అవుతాయి.

అదే స‌మ‌యంలో మీ స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.కాబ‌ట్టి, తెల్ల‌టి మ‌చ్చ‌ల‌తో స‌త‌మ‌తం అయ్యే వారు త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ప్ర‌య‌త్నించండి.

ఫొటో వైరల్: శుభవార్త చెప్పేసిన జబర్దస్త్ కమెడియన్.. ‘అమ్మానాన్నలు కాబోతున్నాం’ అంటూ..