బ్రౌన్ షుగర్‌తో ఇలా చేస్తే.. ఫెయిర్ స్కిన్ మీ సొంతం!
TeluguStop.com
బ్రౌన్ షుగర్.దీనినే ముడి చక్కెర అని పిలుస్తుంటారు.
సాధారణంగా చక్కెర ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటారు.టీ, కాఫీ, స్వీట్స్, పాలు, జ్యూస్ ఇలా ఏదో ఒక దాంతో మిక్స్ చేసి చక్కెరను తీసుకుంటుంటారు.
కానీ, చక్కెర ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.అందుకే, ఇటీవల కాలంలో చాలా మంది వైట్ షుగర్‌కు బదులుగా బ్రౌన్ షుగర్ వాడటం మొదలు పెట్టారు.
వైట్ షుగర్‌తో పోలిస్తే.బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బరువు తగ్గించడంలోనూ, శక్తిని పెంచడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, జలుబు మరియు దగ్గు సమస్యలను దూరం చేయడంలోనూ ఇలా అనేక విధాలుగా బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది.
ఇక కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా.సౌంద్య పరంగానూ బ్రౌన్ షుగర్ గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఫెయిర్ స్కిన్ కావాలనుకునే వారికి బ్రౌన్ షుగర్ బెస్ట్ ఆప్షన్.మరి దీనిని ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బ్రౌన్ షుగర్‌ను మొత్తగా పౌడర్ చేసుకోవాలి.ఆ పౌడర్‌ను ఒక బౌల్‌లో వేసి.
అందులో కొద్దిగా బియ్యం పిండి మరియు పాలు వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టింది.
ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా వారాంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే.
ఈ స్కిన్ ఫెయిర్‌గా మారుతుంది.ఇక ఒక బౌల్‌లో బ్రౌన్ షుగర్ తీసుకుని.
అందులో కొద్దిగా తేనె వేసి కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రామాన్ని ముఖానికి అప్లై.
మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకోవాలి.అనంతరం కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.డెడ్ స్కిన్ సెల్స్ పోయి.
చర్మం ఫెయిర్ లుక్‌లోకి వస్తుంది.అలాగే ఒక బౌల్‌లో బ్రౌన్ షుగర్ పౌడర్ మరియు బాదం ఆయిల్ వేసి.
మిక్స్ చేసుకుని ముఖానికి పట్టించాలి.అరగంట పాటు ఆరనిచ్చి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఫెయిర్ స్కిన్ పొందడమే కాదు.
తాజాగా మరియు కాంతివంతంగా కూడా మీ ముఖం మారుతుంది.
ఆ పాటకు సాయి పల్లవి కొరియోగ్రఫీ చేసిందా…. ఈమెలో ఈ టాలెంట్ కూడా ఉందా?