టీకా తీసుకుని షూటింగ్ లకు రెడీ అవ్వండి
TeluguStop.com
టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా ల షూటింగ్ లు కరోనా కారణంగా సరిగ్గా సాగడం లేదు.
ఇటీవల లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు పూర్తిగా నిలిచి పోయాయి.ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు అనుమతులు ఉన్నా కూడా ఇంకా నిర్మాతలు మరియు మేకర్స్ షూటింగ్ కు వెళ్లేందుకు భయపడుతున్నారు.
ఈ సమయంలో నిపుణుల సూచన మేరకు ఇండస్ట్రీ వర్గాల్లో కదలిక మొదలు అయ్యింది.
సినీ కార్మికులు మరియు నటీనటులు సాంకేతిక నిపుణులు ఇలా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే షూటింగ్ లకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు అంతా కూడా వ్యాక్సిన్ కు సిద్దం అవుతున్నారు.
ప్రముఖులు మరియు సినీ కార్మికులు ఇలా ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొని వ్యాక్సిన్ తీసుకుని ఆ తర్వాత నుండి షూటింగ్ లో జాయిన్ అవ్వాలని భావిస్తున్నారు.
షూటింగ్ లకు హాజరు అయ్యే ప్రతి ఒక్కరు ఇకపై వ్యాక్సిన్ తీసుకోవాలనే కండీషన్ ను పెట్టబోతున్నారు.
దాంతో సినిమా ఇండస్ట్రీలో కరోనా ప్రభావం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.ఇప్పటికే చాలా ఆఫీస్ ల్లో వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తున్నారు.
వ్యాక్సిన్ చేయించుకోని వారిని అనుమతించవద్దంటూ కండీషన్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ కు సిద్దం అవుతారు.
ఇది చాలా మంచి నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇండస్ట్రీలో చాలా సంఘాలు ఉన్నాయి.
వాటి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలనేది ప్రముఖులు అభిప్రాయం.
ఒకటి రెండు నెలల్లో పూర్తిగా ఇండస్ట్రీ వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ లకు వెళ్లవచ్చు అనేది ప్రముఖుల సూచన.
పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..