హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే ఇలా ఈజీగా ఫేషియ‌ల్ చేసుకోండి!

ముఖం గ్లోయింగ్ గా మెరిసిపోవాలని చాలా మంది నెలకు ఒకసారి అయినా బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు.

ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేషియల్ చేసుకుంటే హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే ఈజీగా ఎలా ఫేషియల్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు కీర ముక్కలు, అర కప్పు బాదం పాలు వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ కీరా ఆల్మండ్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని దూది సాయంతో ముఖానికి అప్లై చేసి క్లెన్సింగ్ చేసుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్, మూడు టేబుల్ స్పూన్లు క్యారెట్ కీరా ఆల్మండ్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి స్మూత్ గా రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. """/"/ ఇక చివరిగా మరో గిన్నెను తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు నాలుగు టేబుల్ స్పూన్లు క్యారెట్ కీర ఆల్మండ్‌ జ్యూస్ వేసుకుని క‌లుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయినా వెంటనే వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకొని ముఖానికి ఏదైనా మాయిశ్చరైజర్ ను రాసుకుంటే ఫేషియల్ పూర్తి అయినట్టే.

వారానికి ఒకసారి ఈ విధంగా ఫేషియల్ చేసుకుంటే చర్మం గ్లోయింగ్‌గా మరియు అందంగా మెరుస్తుంది.

చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మరియు చర్మంపై ఏమైనా మచ్చలు, ముడతలు ఉన్న క్రమంగా దూరం అవుతాయి.

వావ్, వాట్ ఏ జీనియస్ జాకెట్.. జపనీయులు మామూలోళ్లు కాదు..