తల్లిదండ్రుల ప్రేమ కోసం ఓ బుడతడు ఉద్యమం

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని గంటల తరబడి కాలక్షేపం చేస్తున్న యువతరం, పెద్దలు, పిల్లల బాధ్యతని పూర్తిగా వదిలేస్తున్నారు.

ఒకప్పుడు ఇంటికి రాగానే ఎంతో ప్రేమగా దగ్గరకి తీసుకొని లాలించే తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల గురించి కనీసం పట్టించుకోకుండా ఇంటికి వచ్చాక కూడా స్మార్ట్ ఫోన్ కి అంకితం అయిపోతున్నారు.

ఎలాంటి ఘటనలు పిల్లల హృదయాలలో తెలియని విషాదాన్ని నింపుతాయి.తల్లిదండ్రుల ప్రేమని కోరుకునే వారికి అది దొరకకపోవడంతో వారు కూడా అనుబంధాలు, ప్రేమ అనే వాటికి దూరం అయిపోతారు.

ఇదిలా ఉంటే జర్మనీలు కొంత మంది పిఅల్లు తల్లిదండ్రులు తమతో ప్రేమగా ఉండమని, తమని పట్టించుకోమని మాకు మీ ప్రేమ కావాలంటూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసారు.

ఇక ఈ పిల్లలు అందరిని ఒకచోటకి చేరి వారికి నాయకత్వం వహించిన వాడు కూడా ఏడేళ్ళ బాలుడు కావడం విశేషం.

పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావంతో కుటుంభాలకి కుటుంభాలు చెల్లా చెదురు అయ్యిపోతున్నాయి.

తల్లిదండ్రుల ఆప్యాయతలకి పిల్లలు దూరం అయిపోతున్నారు.ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్న ఓ బాలుడు తనలా ఇబ్బందులు పడుతున్న కొంతమంది పిల్లలని పోగేసి అమ్మా, నాన్నా స్మార్ట్ ఫోన్ వదలండి, ప్రేమని పంచండి అంటూ ఓ ఉద్యమమే చేపట్టాడు.

అంతేకాదు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు.ఫ్లకార్డులతో నిరసనలు తెలుపుతూ జర్మనీ వీధుల్లో తిరగడం ఎంతో మందిని కదిలించింది.

ఈ బుడతడి నిరసనకి కొంతమంది పెద్దలు కూడా తోడయ్యారు.దాంతో ఈ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా అందరి ఆకర్షించడంతో ఇప్పుడు ఈ బుడతడు చేపట్టిన ఉద్యమం సంచలనంగా మారింది.

వైరల్ వీడియో: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన ఎద్దులు.. చివరికి..?