జర్మనీ వెళ్లాలనుకునే భారతీయులకు జర్మనీ శుభవార్త చెప్పింది!

మీలో ఎవరన్నా జర్మనీలో( Germany ) పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు జర్మనీ ఓ శుభవార్త తీసుకు వచ్చింది.

అవును, అక్కడ పర్యటించేందుకు అవసరమైన షెంజెన్‌ వీసాకు వేచి చూసే కాలం ఇప్పుడు 8వారాలకు కుదించింది.

ఈ మేరకు భారత్‌లోని జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ జార్జ్‌ ఎన్జ్‌వీలర్‌( Deputy Chief George Enzweiler ) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసారు.

ఇక ముందు కూడా మరింతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నామని బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

"""/" / ఈ విషయమై జార్జ్‌ ఎన్జ్‌వీలర్‌ మాట్లాడుతూ."వీసా జారీ చేయడం అనేది చాలా కీలక అంశం.

అందుకే దరఖాస్తును వేగంగా చూసేందుకు, త్వరగా జారీ చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.

ఆ మేరకు మా ముంబై కార్యాలయంలో సిబ్బందిని కూడా గణనీయంగా పెంచాం" అని ఆయన స్పష్టం చేశారు.

27 ఐరోపా దేశాల్లో పర్యాటకం లేదా వ్యాపార నిమిత్తం పర్యటించాలనుకునేవారికి 90 రోజుల వ్యవధి కలిగిన షెంజెన్‌ వీసాను( Schengen Visa ) జారీ చేస్తారనే విషయం అందరికీ తెలిసినదే.

"""/" / ఇక జర్మన్‌ జాతీయ పర్యాటక కార్యాలయం వివరాల ప్రకారం.గత ఏడాది జర్మనీలో 6.

23 లక్షలమంది భారతీయులు పర్యటించినట్టు తెలుస్తోంది.అయితే ప్రస్తుత సవరణల నేపథ్యంలో మరింతమంది అక్కడ పర్యటించనున్నట్టు ఊహాగానాలు చేస్తున్నారు.

చివరిగా 2019లో 9.6 లక్షలమంది దేశంలో పర్యటించగా.

కొవిడ్‌ తర్వాత గత ఏడాదే పర్యాటకుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించిందని జీఎన్‌టీఓ( GNTO ) పేర్కోవడం గమనార్హం.

ఇక జర్మనీ దేశం ప్రతి ఏటా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.ఒక్క ఇండియా మాత్రమే కాకుండా విదేశాలనుండి అక్కడికి పర్యాటకులు వెళుతూ వుంటారు.

ఈ క్రమంలో అనేకమంది అక్కడ సెటిలైపోతారు కూడా.జర్మనీ మధ్య ఐరోపాలోని ఒక దేశం కావడంతో దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, బాల్టిక్ సముద్రం చాలామందిని ఆకట్టుకుంటాయి.

గేమ్ ఛేంజర్ పై కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారా.. వాళ్ల కష్టం గురించి ఆలోచించరా?