ఎడిటర్స్ పొట్టకొడుతున్న ఏఐ టూల్స్… లబోదిబోమంటున్న రైటర్ సంఘాలు!

ఇపుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న అంశం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.( AI ) అవును, ఈ టెక్నాలజీ క్రమంగా విస్తరిస్తోంది.

ఇక చాలా కంపెనీలు వ్యయభారాన్ని తగ్గించుకోవడం కోసం ఏఐపైనే ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది.

తాజాగా ఈ లిస్టులోకి కొన్ని వార్తా సంస్థలు కూడా వచ్చి చేరుతున్నాయి.విషయం ఏమంటే, జర్మనీలో పాపులర్ న్యూస్ ఆర్గనైజేషన్ Axel Springer ఇదే పని చేసింది.

దాదాపు 20% మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానాన్ని ఏఐ టెక్నాలజీతో రీప్లేస్ చేసి షాక్ ఇచ్చింది.

అంతేకాకుండా దశల వారీగా వర్కర్స్ ని తగ్గించుకుని పూర్తిగా ఏఐతోనే కంపెనీ రన్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది కూడా.

ఈ క్రమంలో ఎడిటర్ ( Editor ) స్థాయి వ్యక్తుల నుంచి రైటర్స్, డిజైనర్స్ వరకూ అందరి స్థానాన్నీ రీప్లేస్ చేస్తోంది ఈ టెక్నాలజీ.

"""/" / ఇదే విషయాన్ని కంపెనీ సీఈవో మథియాస్ డాఫ్నర్ తాజాగా వెల్లడించడంతో చాలా రైటర్ అసోషియేషన్స్( Writers Association ) అవాక్కవుతున్నాయి.

ఎలన్ మాస్క్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మథియాస్ దొప్ఫనేర్ "డిజిటల్ ఓన్లీ అప్రోచ్" అనే విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.

ఇప్పటికే ఈ పబ్లిషర్ సంస్థ ఇందుకు సంబంధించి మెమొరాండం కూడా విడుదల చేసింది.

ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్, ప్రూఫ్ రీడర్స్ తో పాటు మరి కొన్ని రోల్స్ ని కూడా త్వరలో తొలగించనున్నారని వినికిడి.

వాళ్ల స్థానంలో పూర్తిగా డిజిటలైజ్డ్ టెక్నాలజీ పనిచేస్తున్నమాట. """/" / ఆక్సల్ స్ప్రింగర్( Axel Springer ) సంస్థ.

జర్మనీలోని బిల్డ్, వెల్ట్ లాంటి సంస్థలకు పేరెంట్ కంపెనీ అన్న సంగతి అందరికీ తెలిసినదే.

ఇప్పుడీ నిర్ణయం వల్ల ఈ రెండు కంపెనీలపైనా ప్రభావం పడనుంది అనడంలో అతిశయోక్తి లేదు.

అటు అమెరికాలోని పొలిటికో, ఇన్సైడర్ లాంటి కంపెనీలపైన కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి.

ఉద్యోగులకు మెయిల్స్ కూడా పంపింది పేరెంట్ కంపెనీ."దురదృష్టవశాత్తూ AI,ChatGPT లాంటి టూల్స్ వచ్చాక మీరు చేయాల్సిన పని కూడా అవే చేసేస్తున్నాయి.

అందుకే మిమ్మల్ని కంపెనీ నుంచి పంపక తప్పడం లేదు" అని చాలా నిక్కచ్చిగా మెసేజులు పెట్టి చెబుతున్నారు.

బిల్డ్ కంపెనీలో మొత్తం వెయ్యి మంది ఉద్యోగులున్నారు.వీరిలో కనీసం 200 మందిని ఇంటికి పంపనున్నారని వినికిడి.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా?