ధర్మశాల అందాలకు ముగ్ధుడైన జర్మన్.. ‘ప్రతి క్షణం నచ్చింది’ అంటూ..?
TeluguStop.com
జర్మనీకి( Germany ) చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ శామ్యూల్ హుబెర్‌కు( Samuel Huber ) ఇండియా ఒక మరపురాని అనుభవాన్ని మిగిల్చింది.
ధర్మశాలలో( Dharamshala ) జరిగిన ఫార్కాస్టర్ బిల్డర్స్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్‌లో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు ఊహించని సంఘటనలు ఎదురయ్యాయి.
అయినా, ఇండియా( India ) అంటే ఆయనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు.భారతీయ ప్రజల ఆతిథ్యం, ప్రకృతి సౌందర్యం ఆయనను కట్టిపడేశాయి.
"ఇండియా బిగినర్స్ కోసం కాదు" అంటారు చాలామంది.హుబెర్ కూడా దీన్ని అంగీకరిస్తున్నాడు.
X (ట్విట్టర్)లో తన అనుభవాలను పంచుకుంటూ, ఇండియా మొదటిసారి వచ్చే వారికి కొంచెం కష్టంగా అనిపించవచ్చని చెప్పాడు.
ఢిల్లీలో దిగిన తర్వాత, ధర్మశాలకు రోడ్డు మార్గంలో వెళ్తుండగా వారి కారు టైరు పంక్చర్ అయింది.
దీంతో ఒక రాత్రి కారులోనే ఉండాల్సి వచ్చింది. """/" /
కష్టమైన ప్రారంభం అయినప్పటికీ, ధర్మశాలకు చేరుకున్నాక హుబెర్ అనుభవం పూర్తిగా మారిపోయింది.
ధర్మశాల అందానికి ముగ్ధుడయ్యాడు.అక్కడి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాడు.
స్థానికుల మంచి హృదయానికి ఫిదా అయ్యాడు.ఇండియాలో తనకి ప్రతిక్షణం నచ్చిందని పేర్కొంటూ, 2025లో మళ్ళీ ఇండియా వస్తానని చెబుతున్నాడు ఈ జర్మన్ టెక్కీ.
"""/" /
కోడింగ్ ఫెలోషిప్‌లో( Coding Fellowship ) పాల్గొనడమే కాకుండా, శామ్యూల్ హుబెర్ భారతీయ డెవలపర్ల నైపుణ్యానికి ముగ్ధుడయ్యాడు.
క్రిప్టో ప్రపంచంలో ఇండియా దూసుకుపోతున్న తీరుని స్వయంగా చూసి ఆశ్చర్యపోయాడు.ఫుట్‌బాల్ ఆటలు, డ్రోన్ ఫ్లైయింగ్‌లతో ఫెలోషిప్ సభ్యులంతా సందడి చేశారు.
భారతీయ సంస్కృతిని తనదైన శైలిలో ఆస్వాదించాడు శామ్యూల్.తన స్నేహితులు బహుమతిగా ఇచ్చిన కుర్తా ధరించి సంప్రదాయానికి గౌరవం ఇచ్చాడు.
ఇక ట్రియుండ్ ట్రెక్ అయితే ఆయన జీవితంలోనే ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది.
ఇండియా ఇచ్చిన అనుభవానికి కృతజ్ఞతలు తెలుపుతూ, 2025లో మళ్ళీ వస్తానని ప్రకటించాడు శామ్యూల్.
స్నేహితులను కలవడం, భారతదేశపు అందాలను మరింత చూడాలనే ఆత్రుతను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
నెటిజన్లు కూడా శామ్యూల్ అనుభవానికి ఫిదా అయి, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
DASA స్కీమ్ అంటే ఏమిటీ? .. ప్రవాస భారతీయ విద్యార్ధులకు ఎలా ఉపయోగమంటే?