ఆలయ భూములకు జియో ట్యాగింగ్..: మంత్రి కొండా సురేఖ

తెలంగాణలోని ఆలయాల భూములకు సంబంధించి మంత్రి కొండా సురేఖ ( Konda Surekha )కీలక ప్రకటన చేశారు.

ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.అదేవిధంగా భూములకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్( Dharani Portal ) లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.ఆధునిక పద్ధతుల్లో భూ రికార్డులను నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

కాగా బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ 6 గురు హీరోలతో సాయి పల్లవి ఎందుకు నటించడం లేదు ?