ఫస్ట్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించిన జియో..!

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చేసిన వాతావరణంలో పని చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( RIL), బిపి ఫ్యూయల్ అండ్ మొబిలిటీ జాయింట్ వెంచర్ అయిన రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్( RBML) కలిసి ప్రపంచ స్థాయి మొబిలిటీ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

అందులో భాగంగా మొదటి జియో బిపి బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించింది.

భారతదేశంలో సరికొత్త మొబిలిటీ సొల్యూషన్స్ వైపు అడుగులు పడుతున్నాయి.అయితే ఇలాంటి సమయంలో కస్టమర్లకు సాటిలేని సేవల్ని అందించడానికి జియో - బిపి బ్రాండ్ ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నవి ముంబైలో నావ్డే దగ్గర జియో- బిపి మొదటి మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించారు.

దీంతో కస్టమర్లకు వేర్వేరు ఇంధన అవసరాలను తీరుస్తున్నాయి.దేశవ్యాప్తంగా జియో - బిపి మొబిలిటీ స్టేషన్స్ ద్వారా యాడిటివైస్డ్ ఫ్యూయల్ ను ఎలాంటి ఖర్చు లేకుండా పొందొచ్చు ఈ ఇంధనంలో అంతర్జాతీయంగా అభివృద్ధి చేయబడిన 'యాక్టివ్' సాంకేతికత ఉంటుంది.

ఇది ఇంజన్లను శుభ్రంగా ఉంచడానికి సహాయపడడమే కాకుండా క్లిష్టమైన ఇంజిన్ భాగాలపై రక్షణ ఏర్పరుస్తుంది.

"""/"/ జియో - బీపీ సంయుక్తంగా కలసి తమ మొబిలిటీ స్టేషన్ల వద్ద ఈవి ఛార్జింగ్ స్టేషన్స్, బాటరీ స్వాప్ స్టేషన్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నాయి .

ఇతర ప్రాంతాల్లో మొబిలిటీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయనున్నాయి.ఈ భారతదేశంలో ప్రముఖ ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్ గా మారడమే ఈ జాయింట్ వెంచర్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ స్టేషన్ ల దగ్గర వైల్డ్ బీన్ కేఫ్ ద్వారా కస్టమర్లకు రిఫ్రెష్మెంట్స్ కూడా లభిస్తాయి.

ప్రతిరోజు 24 గంటలు అందుబాటులో ఉండే ఈ షాపుకు రిలయన్స్ రిటైల్ అవసరమైన సరుకుల్ని, స్నాక్ లను సిగ్నేచర్ కాఫీ తో పాటు స్థానికంగా లభించే మసాలా చాయ్, సమోసా, ఉప్మా, పన్నీర్ టిక్కా రోల్, చాక్లెట్ లావా కేక్ లాంటి స్నాక్స్ కూడా లభిస్తాయి.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఓజీ హైలెట్ అయ్యే సీన్ ఏంటో తెలిసిపోయింది…