రేవంత్ రెడ్డికి సవాల్ గా మారిన సార్వత్రిక ఎన్నికలు... నేతలు సహకరించేనా?

తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలు సవాల్ గా మారనున్నాయని ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు అర్ధమవుతోంది.

అయితే చాలా వరకు కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులు రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్న తరుణంలో ఒంటరి పోరాటం అనేది ప్రస్తుతం రేవంత్ ముందు ఉన్న ప్రధానమైన సవాల్.

అయితే మరో సారి సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతారా లేక అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఇక తనదైన శైలిలో ముందుకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా, లేక అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అనేది భవిష్యత్ లో తెలియాల్సి ఉంది.

అయితే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ  టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచగలిగితేనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల దృష్టి పడే అవకాశం ఉంది.

"""/"/ అయితే కాంగ్రెస్ నేతలందరు ఒక్క తాటిపైకి రాకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉండగా అందరూ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించడానికి రేవంత్ రెడ్డి ఉన్నంత ఆసక్తిగా ఎవరూ లేనటువంటి పరిస్థితి ఉంది.

అందుకె రేవంత్ రెడ్డి కూడా ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే తాజాగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి తాజాగా రేవంత్ తో కలసి పనిచేసే సమస్యే లేదని తన దారి తనదని నా దారి నాదని కుండబద్దలు కొట్టడంతో రానున్న రోజుల్లో రేవంత్ తో కలిసి పనిచేయడంపై పెట్టుకున్న ఆశలు అన్ని అడియాశలు అయిన పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు వచ్చే సార్వత్రిక ఎన్నికలు సవాల్ అని మనం చెప్పవచ్చు.

మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా తన వ్యూహాన్ని అమలు చేస్తారనేది చూడాల్సి ఉంది.

Nandyala Memantha Siddham Yatra : నంద్యాల జిల్లాలో వైసీపీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర