రాజన్న ఆలయంలో నేటినుండి గీతజయంతి ఉత్సవాలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుండి మూడు రోజులపాటు గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
ఉదయం అద్దాల మండపంలో స్వస్తి పుణ్యహవాచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.మూడు రోజులపాటు ప్రతిరోజు శ్రీ స్వామివారికి మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలను అర్చకులు వేదమంత్రాలతో నిర్వహిస్తారు.
నాగిరెడ్డి మండపంలో సంస్కృత పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే భగవద్గీత పఠనం, ఈ సందర్భంగా మూడు రోజులు స్వామివారికి భక్తుల అభిషేకాలు ఉదయం 8 నుండి చేయబడును.