గీత గోవిందం సీక్వెల్ పక్కా… వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ ట్వీట్?

ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి నటుడు విజయ్ దేవరకొండ గురించి పరిచయం అవసరం లేదు ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ అనంతరం అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఇలా ఈ సినిమాలు వరుసగా హిట్ కావడంతో విజయ్ దేవరకొండకు వరుస అవకాశాలు వచ్చాయి అయితే ఈ సినిమా తర్వాత విజయ్ పెద్దగా సక్సెస్ అందుకున్న సినిమాలు ఏవి లేవని చెప్పాలి.

"""/"/ ఇకపోతే గత ఏడాది ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా విడుదల సమయంలో చిత్ర బృందం చేసిన హంగామా మామూలుగా లేదు అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కెరియర్ గురించి అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఖుషి సినిమాని ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడినప్పటికీ త్వరలోనే ఈ సినిమా తిరిగి షూటింగ్ పనులను ప్రారంభించుకొనుంది.

"""/"/ ఇకపోతే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

ఇది కాకుండా ఈయన గీత గోవిందం కాంబినేషన్లో మరో సినిమా కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.

పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో మరొక సినిమా చేయబోతున్నాము అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు అయితే ఈ ముగ్గురి కాంబినేషన్లో తప్పనిసరిగా గీతగోవిందం సీక్వెల్ చిత్రం రాబోతుందనీ అభిమానులు భావిస్తున్నారు.

విజయ్-రష్మిక కాంబో సెట్ అయితే బాగుండు అని మాట్లాడుకుంటున్నారు.మరి ఈ కాంబినేషన్లో గీతగోవిందం సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

భార్య, పిల్లలను చంపేందుకు ఎన్నారై డాక్టర్ ప్రయత్నం.. కట్ చేస్తే..??