గీత గోవిందం 2 రోజుల కలక్షన్స్.. స్టార్స్‌కు సైతం షాక్
TeluguStop.com
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
మొదటి రోజు పబ్లిక్ హాలీడే కనుక భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి.
తొలి రోజు ఏకంగా 10 కోట్లకు చేరువలో షేర్ దక్కింది.రెండవ రోజు నుండి కలెక్షన్స్ తగ్గుతాయని అంతా భావించారు.
కాని రెండవ రోజు కూడా భారీగా వసూళ్లు నమోదు చేసింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో ఏకంగా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను దక్కించుకుని సంచలనం సృష్టించింది.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో యూత్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
విజయ్ దేవరకొండ యాక్టింగ్, హీరోయిన్ రష్మిక మందన గ్లామర్‌తో పాటు నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
సినిమాలో యూత్ ఎలిమెంట్స్‌కు కొదవ లేదు.అందుకే భారీ ఎత్తున ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంది.
రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తూ స్టార్స్‌కు కూడా షాక్ ఇస్తూ ఉంది.
ఇంత భారీగా వసూళ్లు నమోదు చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు కూడా అంచనా వేయలేదు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఒక చిన్న హీరో సినిమా రెండు రోజుల్లో 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు.
స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యం అయ్యే కలెక్షన్స్ ఈ చిత్రానికి వస్తున్న నేపథ్యంలో ట్రేడ్ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఓవర్సీస్‌లో ఈ చిత్రం సునాయాసంగా మిలియన్ మార్క్‌ను చేరుకోబోతుంది.వారాంతంలో ఈ చిత్రం కలెక్షన్స్ మరింత భారీగా ఉండే అవకాశం ఉంది.
ఈ జోరు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
పెద్ద స్టార్ హీరోల్లో కొందరు ఇప్పటికి కూడా 100 కోట్ల రికార్డును క్రాస్ చేయలేక పోయారు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆ మార్క్‌ను చేరుకునే అవకాశం కనిపిస్తుంది.ఇంతటి సంచన విజయాన్ని దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు.
తన తదుపరి చిత్రాలకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?