గోవిందుడి జోరుకు బ్రేక్ పడేది అప్పుడే.. అప్పటి వరకు కుమ్ముడే
TeluguStop.com
విజయ్ దేవరకొండకు ఎక్కడో సుడి ఉన్నట్లుగా అనిపిస్తుంది.ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినా కూడా ‘పెళ్లి చూపులు’ చిత్రం వరకు ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు.
పెళ్లి చూపులు చిత్రంతో క్లాస్ ఆడియన్స్‌కు చేరువ అయిన విజయ్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఊరమాస్ ఆడియన్స్ వరకు వెళ్లాడు.
ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రంతో క్లాస్ మరియు మాస్ ఆడియన్స్‌ను మెప్పించడంతో కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కేరళలో వర్షాల కారణంగా వరద బీభత్సం ఎలా ఉందో గీత గోవిందం కలెక్షన్స్‌తో నిర్మాత తడిసి ముద్దవ్వడంతో పాటు, కొట్టుకు పోయే పరిస్థితి ఉంది.
20 కోట్ల వసూళ్లు సాధ్యం అవుతాయని భావించిన నిర్మాతలకు షాక్ ఇచ్చేలా మొదటి రెండు రోజుల్లోనే 25 కోట్లు ఈ చిత్రం వసూళ్లు చేసింది.
ఇంతటి సంచలన వసూళ్లు సాధిస్తున్న చిత్రానికి మరే చిత్రం పోటీ లేకపోవడం, మరో పది రోజుల వరకు పోటీ రాకపోవడంతో దీర్ఘ కాలికంగా ఈ కలెక్షన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
ఈనెల 31న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ చిత్రం విడుదల అయ్యే వరకు మరే చిత్రాలు కూడా పెద్దవి లేవు.
దాంతో గీత గోవిందం చిత్రం కలెక్షన్స్‌కు అడ్డు అదుపు లేదు.చిన్నా చితకా చిత్రాలు వచ్చినా కూడా గీత గోవిందం ముందు నిల్చునే పరిస్థితి లేదు.
శైలజ రెడ్డి అల్లుడు వచ్చే వరకు గీత గోవిందం తప్ప ప్రేక్షకులకు మరో ఆప్షన్ లేదు.
అందుకే ప్రేక్షకులు గోవిందాన్నే చూడాల్సిందే.అందుకే సునాయాసంగా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్‌ను టచ్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పోటీ లేకుంటే కేవలం వారం రోజుల్లోనే బడ్జెట్‌ను రికవరీ చేయగలదు.
ఇక గీత గోవిందం విషయంలో పాజిటివ్ టాక్ రావడంతో పాటు రెండు వారాలకు పైగా పెద్ద సినిమాలు లేకపోవడంతో పరిస్థితి ఊహించేందుకు సైతం సినీ వర్గాల వారికి వీలు పడటం లేదు.
గోవిందం కుమ్ముడు ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?