ఏపీ హైకోర్టు విభజనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల .. న్యాయమూర్తులు వీరే !

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.జవనరి 1 నుంచి తెలంగాణ, ఏపీకి వేర్వేరుగా హైకోర్టులు పని చేయనున్నాయి.

తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ.రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉన్న భవనంలోనే కొనసాగుతుంది.అమరావతిలో ఏపీ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారు.

ఈ భవన నిర్మాణం చివరి దశలో ఉంది.ఏపీ హైకోర్టు ఈ కొత్త భవనంలోనే కార్యకలాపాలు ప్రారంభించబోతోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుత ఉత్తరాఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ గుడిసేవ శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కుమారి జె.

ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ శ్రీమతి తేలప్రోలు రజనీ, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ శ్రీమతి కొంగర విజయలక్ష్మీ, జస్టిస్ గంగారావు.

జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ యం.సత్యరత్న శ్రీ రామచంద్రరావు, జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పొనుగోటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ చౌదరి, జస్టిస్ బులుసు శివ శంకరరావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ తొడుపునూరి అమరనాథ్ గౌడ్.

పుష్ప కా బాప్…. చరణ్ సినిమా విడుదల వేళ అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్?