ఇప్పటికీ సినిమా అంటే ప్రాణం అంటున్న గాయత్రి రావు…

కొన్ని సినిమాల్లో కొందరు కొన్ని క్యారెక్టర్స్ చేసి చాలా రోజుల పాటు జనాలకి గుర్తుండి పోతారు అలాంటి వాళ్లలో గాయత్రి రావు ఒకరు, గాయత్రి రావు అంటే జనాలకి గుర్తుకు రావ‌డం కాస్త క‌ష్ట‌మే కానీ, హ్యాపీ డేస్ ఫేమ్ అప్పు అంటే మాత్రం మనందరికీ ట‌క్కున మైండ్ లోకి వ‌చ్చేస్తుంది.

శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ సినిమాల్లో హ్యాపీ డేస్‌( Happy Days ) ఒక‌టి.

ఇందులో వరుణ్ సందేశ్, త‌మ‌న్నా హీరో, హీరోయిన్ గా న‌టిస్తే.నిఖిల్, గాయ‌త్రి రావు, సోనియా దీప్తి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అమిగోస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై శేఖ‌ర్ క‌మ్ముల( Shekhar Kammula ) స్వ‌యంగా ఈ సినిమాను నిర్మించారు.

"""/" / ఇక 2007లో విడుదలైన హ్యాపీ డేస్‌ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

పరిమితమైన బడ్జెట్‌తో, చిన్నపాటి తారా గణంతో నిర్మించబడిన ఈ చిత్రం కాలేజీ విద్యార్థుల జీవితం ఇతివృత్తంగా తీశారు.

దాంతో అప్ప‌ట్లో ఈ సినిమా యూత్ ను బాగా ఆక‌ట్టుకుంది.ఇక‌పోతే ఈ సినిమాలో అప్పు అలియాస్ అప‌ర్ణ‌ పాత్ర‌లో గాయ‌త్రి రావు న‌టించింది.

ఈ సినిమాలో అప్పు పాత్ర కోసం శేఖర్ కమ్ముల గాయత్రి రావు( Gayatri Rao ) తో అప్పు పాత్ర కి వెంట్రుకలు ఉండకూడదు.

అని చెప్పాడట దాంతో ఆమె సినిమా మీద పాషన్ తో వెంట్రుకలను కూడా కత్తిరించికుందట.

"""/" / ఇక ఈ సినిమాలో నిఖిల్ కు క్లోజ్ ఫ్రెండ్ గా అల‌రించిన గాయ‌త్రి రావును అంత తేలికగా అయితే ఎవ్వరు మర్చిపోలేరు.

హ్యాపీ డేస్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఆరెంజ్‌ లో మాయ పాత్రలో మెరిసింది.

అలాగే గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది.

చేసింది మూడు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో ఎప్పటికి గుర్తు ఉండి పొయే పాత్రలలోనే ఆమె నటించింది.

గబ్బ‌ర్ సింగ్ త‌ర్వాత గాయ‌త్రి సినిమాల‌కు పూర్తిగా దూరమైంది. """/" / 2019లో గాయత్రి రావు వివాహం చేసుకుని చెన్నైలో( Chennai ) స్థిర‌ప‌డింది.

గాయ‌త్రి ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు.గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా ఆమె మారిపోయింది.

వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న గాయ‌త్రి.మంచి పాత్ర‌లు వ‌స్తే న‌టించేందుకు సిద్ధంగా ఉంద‌ట‌.

ఇక‌ చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.గాయ‌త్రి త‌ల్లి కూడా ఒక న‌టినే.

ఆమె పేరు ప‌ద్మ‌.క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా చాలా ఏళ్ల నుంచి టాలీవుడ్ లో కొన‌సాగుతున్న ప‌ద్మ‌.

ప్ర‌స్తుతం సీరియల్స్ లో మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు.అదే విధంగా తనకి తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్25, బుధవారం 2024