బిగ్ బాస్ హౌస్ లో శివాజీ మీద పంచులు విసిరిన గౌతమ్ తల్లి..!

బిగ్ బాస్ హౌస్ లో( Bigg Boss ) ప్రస్తుతం అత్యధిక ఓట్లతో టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే శివాజీ( Shivaji ) పేరే చెప్తారు.

అందరి కంటెస్టెంట్స్ లాగానే ఇతను కూడా తప్పులు పొరపాట్లు చేస్తున్నాడు.టాస్కులు పెద్దగా ఆడడు, ఇంట్లో ఒక్కటంటే ఒక్క పని కూడా చెయ్యదు.

టాస్కు లేని సమయం లో తన బ్యాచి ని వేసుకొని సోఫాలో కూర్చొని కబుర్లు చెప్తూ కొంత మంది కంటెస్టెంట్స్ ని విమర్శిస్తూ ఉంటాడు.

అయితే ఎంత తప్పులు చేసిన, ఎన్ని వేషాలు వేసిన ఈయన తన మాటకారి తత్త్వం తో నాగార్జున ని( Nagarjuna ) సైతం ఇరుకున పెట్టేస్తాడు.

అందుకే ఇతనికి బిగ్ బాస్ హౌస్ లో ఎదురు చెప్పేవాళ్ళు లేకుండా పొయ్యారు.

ఒక్క అమర్ దీప్ మరియు గౌతమ్ మాత్రమే శివాజీ తప్పు ఒప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి అడుగుపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

"""/" / నిన్న శివాజీ కొడుకు, అశ్విని తల్లి మరియు అర్జున్ సతీమణి బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు.

వీళ్ళ రాక, వాళ్ల మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది.

ఇక నేడు గౌతమ్( Gautam ) వాళ్ల అమ్మ, ప్రియాంక( Priyanka ) కాబొయ్యే భర్త శివ కుమార్, మరియు భోలే శవాలీ సతీమణి హౌస్ లోకి అడుగుపెట్టారు.

వీరిలో గౌతమ్ తన అమ్మతో జరిపిన సంభాషణ హృదయాల్ని కట్టిపారేసాలా చేసింది.ఆమె హౌస్ లోకి అడుగుపెట్టగానే ప్రతీ ఒక్కరితోను ఎంతో ప్రేమగా వ్యవహరించింది.

ముఖ్యంగా ఈమెని చూడగానే యావర్( Yawar ) తన తల్లిని గుర్తు చేసుకుంటూ కంటతడి పెడుతాడు.

దీనికి గౌతమ్ అమ్మ అలా ఏడవకు నాయనా, నన్ను కూడా మీ అమ్మ అని అనుకో, మా ఇంటికి వస్తూ ఉండు అని అంటుంది.

అలా అందరితో మంచిగా మాట్లాడిన ఆమె శివాజీ మీద మాత్రం కౌంటర్లు వేసింది.

"""/" / గౌతమ్ కెప్టెన్ అయ్యింది నావల్లే అంటూ శివాజీ డప్పులు కొట్టుకోవడం ప్రారంభించాడు.

అప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడుతూ అందరూ తీసుకున్న నిర్ణయం వల్లే గౌతమ్ కెప్టెన్ అయ్యాడు అని అంటారు.

అప్పుడు గౌతమ్ తల్లి( Gautam Mother ) మరి శివన్న ఏమిటి తన వల్లే కెప్టెన్ అయ్యాడు అన్నట్టుగా చెప్తున్నాడు, అందరి వల్ల కదా అయ్యింది అంటూ సమాధానం ఇచ్చింది.

దీంతో శివాజీ కి నోటి నుండి మాట రాలేదు.ఆమె మాట్లాడిన మాటలకు హర్ట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఆమె వెళ్తున్న సమయం లో నువ్వు వెళ్ళకు రోయ్.

నీకింకా టైం ఉంది, అమ్మని పంపించు అని సెటైర్స్ వేస్తాడు.దీనిపై సోషల్ మీడియాలో నెగటివిటీ ఏర్పడింది.

మరోమారు కెమెరాకు చిక్కిన టాలీవుడ్ రూమర్ జంట.. వైరల్ వీడియో