బాలీవుడ్ బాద్షాకే కండిషన్లు పెట్టిన గౌరీ… ఆ కండిషన్ ఫాలో అవ్వాల్సిందే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు షారుక్ ఖాన్(Shahrukh Khan) ఒకరు బాలీవుడ్ కింగ్ ఖాన్ గా గుర్తింపు పొందినటువంటి ఈయన త్వరలోనే డుంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే ఈయన పలు ఆలయాలను సందర్శిస్తూ తన సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్ గురించి పలు విషయాలు తెలియజేశారు.

"""/" / షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ( Gauri Khan) ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈమె ముంబైలో ఎన్నో రెస్టారెంట్లకు డిజైనర్ గా వ్యవహరించారు.అదేవిధంగా పలువురు స్టార్స్ ఇంటికి కూడా ఈమె డిజైనర్ గా పనిచేశారు.

గౌరి ఖాన్ ఎంతో పెద్దపెద్ద ప్రాజెక్టులను చేపట్టి ఇంటీరియర్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు అయితే తన భర్తకు మాత్రం ఈమె ఒక భారీ కండిషన్ పెట్టారట.

ఏదైనా రెస్టారెంట్ కు వెళితే కనుక తాను డిజైన్ చేసిన రెస్టారెంట్( Reasturant ) కు మాత్రమే వెళ్లాలి అంటూ కండిషన్ పెట్టారని తెలుస్తుంది.

"""/" / ఈమె ముంబైలో ఎన్నో రెస్టారెంట్లకు ఇంటీరియర్ డిజైనర్ గా వ్యవహరించారు.

దీంతో తాను డిజైన్ చేసినటువంటి రెస్టారెంట్లకు మాత్రమే నువ్వు వెళ్ళాలి అంటూ తనకు కండిషన్ పెడుతుంది అంటూ ఓ సందర్భంలో షారుక్ ఖాన్ తన భార్య తనకు పెట్టిన కండిషన్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించినటువంటి షారుక్ ఖాన్ త్వరలోనే డంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 21 విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక డిసెంబర్ 22వ తేదీ ప్రభాస్ సలార్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 .

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?