ఇండియన్ పనోరమాలో ప్రదర్శనకి ఎంపికైన తెలుగు చిత్రం

ఇండియన్ పనోరమా అంటే సినిమా వేడుకలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఏదైనా సినిమా అందులో ప్రదర్శించాలి అంటే కచ్చితంగా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకొని ఉండాలి.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి అక్కడ అస్సలు చోటు ఉండదు.కేవలం ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఉన్నవాటినే ఎంపిక చేస్తారు.

అలాంటి ఇండియన్ పనోరామలో ప్రదర్శనకి వచ్చే తెలుగు సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఇప్పుడు అక్కడ సినిమా ప్రదర్శనకి ఓ చిన్న సినిమా ఎంపిక కావడం విశేషం.

లాక్ డౌన్ కాలంలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన గతం అనే సినిమా ఇండియన్ పనోరమాకి ఎంపికైంది.

ఇందులో ప్రదర్శనకి ప్రపంచ వ్యాప్తంగా 23 సినిమాలని ఎంపిక చేస్తే అందులో గతం సినిమాకి కూడా చోటు దక్కడం విశేషం.

గోవాలో జరగనున్న 51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకి ఎంపిక కావడం గతం సినిమాకి దక్కిన అరుదైన గౌరవం అని చెప్పాలి.

మెయిన్‌ స్ట్రీమ్‌ విభాగంలో తమిళ చిత్రం ధనుష్ అసురన్‌, మలయాళ చిత్రం కప్పేలా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన హిందీ చిత్రం ఛిఛోరే ప్రదర్శనకు ఎంపికయ్యాయి.

ఈ మూడు చిత్రాలలో అసురన్, కప్పేలా తెలుగులో రీమేక్ కి రెడీ అవుతుండటం విశేషం.

గతం సినిమాలో భార్గవ పోలుదాసు, రాకేష్‌ గలేభే, పూజిత ముఖ్య పాత్రల్లో నటించారు.

సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాని కిరణ్‌ కొండమడుగుల తెరకెక్కించారు.అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ఈ సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది.ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సినిమాలు టాలీవుడ్ యంగ్ దర్శకుల నుంచి వస్తున్నాయి.

అలా వచ్చిన వాటిలో గతం కూడా చేరింది.అయితే సరైన ప్రమోషన్ లేకపోవడం వలన సినిమా ఎక్కువ మందికి చేరువ కాలేదని తెలుస్తుంది.

కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్