దగ్గుతో బాధపడుతున్నారా? అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
TeluguStop.com
ఒక్కో సారి దగ్గు పట్టుకుందంటే అస్సలు వదిలి పెట్టదు.దాంతో దగ్గు దగ్గలేక నానా ఇబ్బందులు పడుతుంటారు.
అలాగే దగ్గును ఎలా నివారించుకోవాలో తెలియక తెగ సతమతమైపోతుంటారు.అయితే ఇంట్లోనే సరైన పద్ధతులు పాటిస్తే.
చాలా త్వరగా దగ్గును తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా దగ్గుకు చెక్ పెట్టడంలో వెల్లుల్లి టీ అద్భుతంగా పనిచేస్తుంది.
మరి ఆ వెల్లుల్లి టీని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి హీట్ చేయాలి.
ఇప్పుడు ఈ నీటిలో క్రష్ చేసిన వెల్లుల్లిని వేసి.నీటి రంగు మారే వరకు మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ నిమ్మ రసం కలిపితే వెల్లుల్లి టీ సిద్ధమైనట్టే.
దగ్గుతో బాధ పడే వారు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ వెల్లుల్లి టీని సేవించాలి.
తద్వారా వెల్లుల్లి టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషక విలువలు దగ్గును త్వరగా నియంత్రిస్తాయి.
దగ్గు మాత్రమే కాదు.వెల్లుల్లి టీని తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.
మరి అవేంటో కూడా చూసేయండి.రోజుకు ఒక సారి వెల్లుల్లి టీని తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
దాంతో మీరు వెయిట్ లాస్ అవుతారు.అలాగే అధిక రక్త పోటుతో ఇబ్బంది పడే వారు వెల్లుల్లి టీని సేవిస్తే.
రక్త పోటు స్థాయిలు అదుపులోకి వస్తాయి. """/" /
ఇక వెల్లుల్లి టీని తాగడం వల్ల.
చర్మంపై మొటిమలు, ముడతలు ఏర్పకుండా ఉంటాయి.రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.
కాబట్టి దగ్గు ఉన్న వారే కాదు.ఎవ్వరైనా వెల్లుల్లి టీని తీసుకోవచ్చు.
చలికాలంలో ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఊడమన్న ఊడదు!