ముఖంపై నల్ల మచ్చలా.. అయితే వెల్లుల్లితో నివారించుకోండిలా!
TeluguStop.com
ముఖంపై నల్ల మచ్చలు ఎంతగా వేధిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.
నల్ల మచ్చలు ఉంటే మాత్రం అందహీనంగా కనిపిస్తారు.ముఖ్యంగా నల్ల మచ్చలు మరింత ఇబ్బంది .
దీంతో మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములు, లోషన్లు ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ, ఫలితం లేకపోతే బలైపోతుంటారు.అయితే వెల్లుల్లి నల్ల మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
మరి వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసుకుని.
అందులో నుంచి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఆ వెల్లుల్లి రసంలో కొద్దిగా కలబంద గుజ్జు మరియు రెండు చుక్కలు నిమ్మ రసం వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని నల్ల మచ్చలు ఉన్న చోట అప్లై చేసి.
పావు గంట పాటు ఆరనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తూ.నల్ల మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
"""/" /
రెండొవది.వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నల్ల మచ్చలు ఉన్నచోట రాసి.రెండు నిమిషాల పాటు మసాజ్ చేసి కాసేపు వదిలేయాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా నల్ల మచ్చలు మటుమాయం అవుతాయి.
మొటిమలు ఉన్న వారు కూడా ఈ టిప్ ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది.
"""/" /
మూడొవది.ఒక బౌల్ తీసుకుని అందులో వెల్లుల్లి పేస్ట్, పెరుగు మరియు కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నల్ల మచ్చలు ఉన్న చోట రాసి.ఇరవై నిమిషాలు పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారినికి రెండు, మూడు సార్లు చేస్తుంటే క్రమంగా నల్ల మచ్చలు తగ్గి.
ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.
వైరల్: రైలు పట్టాలపై నిద్ర పోయిన వీర వనిత.. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!