అనుష్క అందంపై గరికపాటి కామెంట్స్... గతాన్ని గుర్తు చేస్తూ వర్మ కామెంట్స్?

దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి వివాదాలకు కారణమయ్యాయో మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే చిరంజీవి గురించి గరికపాటి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడంతో ఎంతోమంది అభిమానులు పలువురు సినీ ప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇక ఈ వివాదం కాస్త చల్లబడింది అనుకునే లోపు ఈ వివాదంపై మరోసారి రాంగోపాల్ వర్మ అగ్గిరాజేశారు.

ఈ విధంగా ఈ విషయంపై రాంగోపాల్ వర్మ రియాక్ట్ కావడంతో ఈ వివాదం మరోసారి ముదిరింది.

ఈ క్రమంలోనే మరి కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై మాట్లాడుతూ గరికపాటిని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఇలా ఎంతోమంది గరికపాటి పట్ల విమర్శలు వ్యక్తం చేయగా మెగాస్టార్ మాత్రం ఈ విషయంపై ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా గతంలో గరికపాటి నటి అనుష్క గురించి చేసినటువంటి కామెంట్లను ఈ సందర్భంగా వర్మ షేర్ చేస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

"""/"/ గతంలో అనుష్క గురించి గరికపాటి మాట్లాడుతూ.హీరోయిన్లను కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు.

ఇందులో ఏముంది అనుకునేవాడిని.నా చూపు కూడా ఒక నటి దగ్గర ఆగింది ఆమె ఎవరంటే అంటూ అనుష్క పేరు తెలియచేశారు.

అనుష్క ఒక మంచి స్టిల్ పేపర్ లో ఉంది మా అబ్బాయి పేపర్లో అనుష్క ఫోటో చూస్తుండగా నేను కూడా అలాగే అనుష్క అందాన్ని చూస్తూ ఉండిపోయానని ఈ సందర్భంగా గరికపాటి చేసినటువంటి ఈ కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి అయితే ఈ విషయాన్ని తిరిగి వర్మ గుర్తు చేస్తూ మరోసారి గరికపాటి పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

అలా పిలవొద్దని అభిమానులను రిక్వెస్ట్ చేసిన నయనతార.. ఫ్యాన్స్ పాటించడం సాధ్యమేనా?