గరికపాటి సంచలన నిర్ణయానికి అసలు కారణం ఏంటో తెలుసా?.. ఆయన నిర్ణయాన్ని మార్చే వారే లేరా?

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ముఖ్యంగా హిందువులకు గరికపాటి నరసింహారావు అవధాని గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గర అయ్యాడు.

ఆయన చెప్పే ప్రవచనాలకు ఎంతటి డిమాండ్‌ ఉందో కూడా తెలిసింది.ఆయన తన ప్రవచనాలను బుల్లి తెర ద్వారా వినిపించే వారు.

ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా జీవిత సత్యం అని, ఆయన చెప్పే ప్రతి విషయం కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట మనకు ఉపయోగపడుతాయని అంతా భావిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పండితుల నుండి పామరుల వరకు అందరి అభిమానంను దక్కించుకున్న గరికపాటి వారు తన ప్రవచనాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ విషయాన్ని గతంలో కూడా పలు సందర్బాల్లో ఆయన చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

అయితే ఈసారి మాత్రం అధికారికంగా క్లారిటీగా ప్రకటించాడు.తాను వచ్చే ఏప్రిల్‌ నుండి అంటూ ఉగాది తర్వాత ప్రవచనాలు చెప్పడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

సహస్రపారాయణంలో ఇంకా 800 నామాలు ఉన్నాయని, ఆ నామాలపై ప్రవచనాలను ఏప్రిల్‌ వరకు పూర్తి చేస్తానంటూ ప్రకటించాడు.

ఏప్రిల్‌ తర్వాత తాను ఎక్కువగా మౌనంగానే ఉంటాను అన్నాడు.మౌనవత్రంతో దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తానంటూ గరికపాటి ప్రకటించాడు.

ఆయన నిర్ణయంతో తెలుగు వారు చాలా మంది షాక్‌ అవుతున్నారు.మరి కొందరు మాత్రం ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గరికపాటి వారు ఎందుకు తన ప్రవచనాలకు గుడ్‌ బై చెప్పబోతున్నాడు అనే విషయమై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు అందరు తెలుగు వారు ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

కొందరు వయస్సు మీద పడుతుంటే ఆరోగ్య సమస్యల వల్ల ఆయన ప్రవచనాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడేమో అని కొందరు, మరి కొందరు మాత్రం, ఆయన వారసుడిగా తన కొడుకు గురజాడను తెరపైకి తీసుకు వచ్చేందుకు ఇలా దూరం అవుతున్నాడని అంటున్నారు.

మొత్తానికి గరికపాటి వారి ప్రవచనాలను ఇకపై ఆయన వారసుడు గురజాడ నోటి నుండి తెలుగు వారు వినబోతున్నారు.

గరికపాటి వారు ప్రవచనాలు చెప్పకపోయినా ఇంకా కొన్ని పదుల సంవత్సరాల పాటు ఆయన ప్రవచనాలు బుల్లి తెరపై, లేదా యూట్యూబ్‌లో రికార్డెడ్‌ వర్షన్‌లు మారు మ్రోగుతూనే ఉంటాయి.

అంతా సుద్దపూసలే .. చంద్రకాంత్, పవిత్రలే అంతా తప్పు చేశారా ?