తోటలు ధ్వంసం.. విషం పెట్టి 100కు పైగా కోతులను చంపేశారు?

మనుషులలో స్వార్థం, సంకుచిత మనస్తత్వం నానాటికీ పెరిగిపోతోంది.కొన్ని సందర్భాలలో ఇతరులను, అమాయక జీవులను వేధించి పైశాచికత్వం పొందుతున్నారు.

చాలా దారుణంగా వ్యవహరిస్తుంటారు.ఇలాంటి ఘటనల గురించి వినగానే ఎవరికైనా మనసు చలిస్తుంది.

ఇలాంటి ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.గుట్టలు గుట్టలుగా కోతుల శవాలు అక్కడ పడి ఉన్నాయి.

బీచ్‌లో వానరాల మృతదేహాలను చూసి, చాలా మంది చలించిపోయారు.దీనిపై జంతు హక్కుల పరిరక్షణ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. """/"/ మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ బీచ్ పరిధిలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

సమీపంలోని సరుగుడు (నీలగిరి) తోటలు ఉన్నాయి.అటుగా వెళ్లిన వారు ఒక్కసారిగా కంగుతిన్నారు.

వందల కొద్దీ వానరాల మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి.వాటిని చూడగానే చాలా మంది బాధ పడ్డారు.

ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా ఉన్న కోతుల కళేబరాల వద్ద వారంతా అయ్యో అనుకుంటూ నిల్చుండిపోయారు.

అయితే వాటిని పరిశీలించగానే అందరికీ ఒక్క విషయం అర్ధం అయింది.కోతులకు విషం పెట్టి చంపేశారనే అనుమానాలు బలపడ్డాయి.

దీనిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. """/"/సమీపంలోని పొలాల్లో కోతుల సంచారం ఎక్కువగా ఉంటుంది.

రైతులు వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాటిని తరిమేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇదే కోవలో ప్రయత్నించి, చివరికి ఇలా విషం పెట్టి చంపేసి ఉంటారని అంతా భావిస్తున్నారు.

కోతులు పంటలను నాశనం చేస్తుంటే టపాసులు వంటివి పేల్చి వాటిని తరిమికొట్టొచ్చు.అయితే ఇలా అమానుషంగా కోతులను విషం పెట్టి చంపడం దారుణం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు సుబ్బరాజు… ఫోటోలు వైరల్!