చంద్రబాబుకు తారక్ థ్యాంక్స్ తో గ్యాప్ తగ్గినట్టేనా.. ఆ ఫ్యాన్స్ దేవరకు సపోర్ట్ చేస్తారా?
TeluguStop.com
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( AP CM Chandrababu Naidu ) దేవర సినిమాకు టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు ఏకంగా 135 రూపాయల పెంపు లభించడం అంటే దేవరకు అదిరిపోయే తీపికబురు అనే చెప్పాలి.
చంద్రబాబుకు తారక్ థ్యాంక్స్ తో గ్యాప్ తగ్గినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ( Deputy CM Pawan )కు ఆయన థ్యాంక్స్ చెప్పారు.
దేవర ( Devara )సినిమాకు టికెట్ రేట్ల పెంపు వల్ల ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
క్షేత్రస్థాయిలో దేవర మూవీ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.సినిమా రిలీజ్ కు ఆరు రోజుల సమయం ఉన్నా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
చాలా చోట్ల ఇప్పటికే దేవర మూవీకి సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. """/" /
ఒక థియేటర్ దగ్గర అభిమానులు మరీ హద్దులు దాటి అభిషేకాలు చేసి కూడా వార్తల్లో నిలవడం కొసమెరుపు.
దేవర సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉండనున్నాయి.
దేవర కటౌట్లు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. """/" /
దేవర బడ్జెట్, బిజినెస్ విషయంలో నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.
సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దేవర సినిమాకు తారక్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారనే సంగతి తెలిసిందే.
దేవర సినిమా యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను మాత్రం మెప్పించడం పక్కా అని తెలుస్తోంది.
ఏది స్థిరంగా ఉండదు…. సంచలన పోస్ట్ చేసిన సమంత…దాని గురించేనా?