గంటెల ఝాన్సీరాణిీకి విశిష్ట నంది పురస్కారం
TeluguStop.com
ఖమ్మం పట్టణంకు చెందిన గంటెల ఝాన్సీరాణిీకి విశిష్ట నంది పురస్కారం - 2022 అవార్డును దక్కించుకున్నారు .
ఈ సందర్బంగా ఝాన్సీరాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ కల్చరల్ లాంగ్వేజ్ శాక మరియూ కీర్తి ఆర్ట్స్ అకాడమీ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవలే హైదరాబాద్ బిర్ల ఆడిటోరియంలో నిర్వహించిన విశిష్ట నంది పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ , ప్రభుత్వ చీఫ్ విప్ రుద్ర రాజు పద్మ రాజు , ప్రముఖ సంఖ్య శాస్త్ర నిపుణులు దావాగ్ని శర్మ , కీర్తి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ బిందు లిమ్మ మరికొంత మంది ప్రముఖులు చేతుల మీదుగా అందుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు .
ఈ అవార్డు తను సేవా చేయుటకు మరింత చేయూత ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు .
ఆమె ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ (గణితం) ZPHS బోనకల్ లో పని చేస్తుందని తెలిపారు .
కల్తీ నెయ్యిని గుర్తించేందుకు ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..!