గంటా చూపు భీమిలి వైపు ? మనసు జనసేనా వైపు ? 

విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయంగా మార్పు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నా,  పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.  అప్పుడప్పుడు మాత్రమే మొక్కుబడిగా ఏదో ఒక విషయంపై స్పందిస్తున్నారు తప్ప , పూర్తి స్థాయిలో టీడీపీ నాయకుడు కాలేకపోతున్నారు.

ఇక పార్టీ సైతం గంటా శ్రీనివాసరావు విషయంలో అసంతృప్తితోనే ఉంది.ఆయన 2024 ఎన్నికల నాటికి పార్టీలో ఉండటం కష్టమనే అభిప్రాయంతోనే ఉంది.

  అందుకే ఆయనకు పార్టీ తరఫున ఎటువంటి పదవీ అప్పగించలేదు.అయితే ఆయన వైసీపీలో చేరేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఆయన రాకను మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుకుంటునే వస్తున్నారు.

  ఈ విషయంలో జగన్ సానుకూలంగానే ఉన్న విజయసాయిరెడ్డి,  అవంతి శ్రీనివాసరావు వంటి వారు అడ్డంకులు సృష్టించడం తో గంటా వైసీపీ పై  ఆశలు వదిలేసుకున్నారు.

ఇక ప్రస్తుతం జనసేన వైపు ఆయన చూపు ఉంది.జనసేన నుంచి పోటీ చేస్తే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేగా గెలుపొందడం తో పాటు , కీలక స్థానంలో కూర్చుంటాననే నమ్మకంతో ఆయన ఉన్నారు.

  2024 నాటికి ఖచ్చితంగా టీడీపీ , జనసేన పొత్తు పెట్టుకుంటే విజయం సాధించడం అంత కష్టమేమీ కాదని, గంటా అంచనా వేస్తున్నారు.

"""/" / ప్రస్తుతం విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గా కొనసాగుతున్న ఈ నియోజకవర్గం పై అంతగా ఆశలు పెట్టుకోలేదు.

ఇక్కడ మరోసారి పోటీ చేసినా గెలుపు ఇబ్బంది అవుతుందని,  అందుకే భీమిలి నియోజకవర్గం తనకు సేఫ్ అనే అభిప్రాయంలో గంటా ఉన్నారు.

అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఇప్పటికే రాజీనామా చేశారు.భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన తన సన్నిహితులతో వ్యాఖ్యానించారు భీమిలిలో జనసేన తరపున పోటీ చేస్తే టీడీపీ మద్దతుతో గెలుపు సులువు అవుతుందని అంచనా వేస్తున్నారట.

హైవే మీద పిచ్చిగా గెంతులు వేసిన యువతి.. చివరికి ఏమైందో చూస్తే..?