బాబు ప్రకటన 'గంటా ' లో మార్పు తెచ్చిందా ? 

తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఎవరికీ అర్థం కాకుండా ఉంది.

మొదటి నుంచి ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉండడం పార్టీలో ఉన్న లేనట్టుగా వ్యవహరిస్తుండడం , పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, ఇలా ఎన్నో రకాల కారణాలతో ఆయనను చంద్రబాబు సైతం పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తున్నారు.

కొద్ది నెలల క్రితం ప్రకటించిన పార్టీ కమిటీల్లోనూ ఆయనకు స్థానం కల్పించలేదు.జనసేన ,బిజెపి లలో ఏదో ఒక పార్టీలో ఆయన చేరబోతున్నారని అంతా భావిస్తూ వస్తున్నారు.

తాజాగా విశాఖ నార్త్ నియోజకవర్గంలో జరిగిన టిడిపి మహిళ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

      ఈ కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా, ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.

ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలని,  ఏపీ బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలి అంటూ గంటా వ్యాఖ్యానించారు.

టిడిపి జాతీయ స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు పటిష్టంగా ఉందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు .

వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని,  ఈ విషయం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తోందని గంటా వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం వైసీపీపై వస్తున్న వ్యతిరేకతను టిడిపి నేతలు వాడుకోవాలని , వచ్చే ఎన్నికల్లో విజయానికి దీనిని అనువుగా మార్చుకోవాలని సూచించారు.

అయితే గంటాలో ఒక్కసారిగా ఈ మార్పు కనిపించడానికి చాలానే కారణాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.

    """/"/     ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని పార్టీకి కష్టకాలంలో అండదండలు అందించిన వారికే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటన చేయడంతో,  గంటా మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది.

బిజెపి , వైసిపి, జనసేన వంటి పార్టీల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు ప్రయత్నం చేయడం కంటే.

టీడీపీ లోనే ఉంటూ తను ప్రాధాన్యాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో ఉండటంతోనే అకస్మాత్తుగా ఆయనలో ఈ మార్పు కనిపించడానికి కారణం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ