తెలంగాణలో నీకేం పట్టదా పవన్‌?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల తెలుగు దేశం పార్టీకి గుడ్‌ బై చెప్పిన విషయం తెల్సిందే.

ఆయన వైకాపాలో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.అన్నట్లుగానే వంశీ వైకాపాలో చేరబోతున్నట్లుగా ప్రకటించాడు.

జగన్‌ వెంట నడిచేందుకు వెళ్తున్నట్లుగా తాజాగా ప్రెస్‌ మీట్‌లో ప్రకటించాడు.ఆ ప్రెస్‌మీట్‌లో మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

ఈ సందర్బంగా పవన్‌ను కూడా వంశీ టార్గెట్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయ పరిపక్వత లేదు అంటూ వ్యాఖ్యనించాడు.కేవలం ఆంధ్రాలోనే పవన్‌ ప్రశ్నించాలనుకుంటున్నాడా.

తెలంగాణలో ప్రజల సమస్యలపై ఎందుకు పవన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు అంటూ వంశీ ప్రశ్నించాడు.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల గురించి ఇప్పటి వరకు పవన్‌ నోరు విప్పక పోవడానికి కారణం ఏంటీ అంటూ వంశీ అడిగాడు.

కేవలం పవన్‌ ఏపీలోనే సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.అంతే తప్ప ఆయన తెలంగాణలో కనీసం ఊసులోకి కూడా లేడు అంటూ వంశీ అన్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు వంశీ ఆసక్తి చూపించలేదు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ