కృష్ణాజిల్లా లో విషాదం.. గంజాయి ముఠా చేతిలో యువకుడు దారుణ హత్య..!

కృష్ణాజిల్లా లో విషాదం గంజాయి ముఠా చేతిలో యువకుడు దారుణ హత్య!

కృష్ణాజిల్లా( Krishna District ) పెనమలూరు లో గొడవ ఆపేందుకు ప్రయత్నించి ఓ యువకుడు తన ప్రాణాలను పోగొట్టుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

కృష్ణాజిల్లా లో విషాదం గంజాయి ముఠా చేతిలో యువకుడు దారుణ హత్య!

గంజాయి ముఠా ఫుల్ గా తాగి రోడ్డుపై వెళ్లే వారిని డబ్బుల కోసం బెదిరించి దాడులు చేస్తున్న క్రమంలో ఓ యువకుడ్ని బెదిరిస్తూ ఉండగా మరో యువకుడు అడ్డుగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తాడిగడప డొంక రోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా లో విషాదం గంజాయి ముఠా చేతిలో యువకుడు దారుణ హత్య!

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. """/" / పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

యనమలకుదురు లోని తాడిగడప డొంక రోడ్డుకు చెందిన షేక్ రఫీ (33) లబ్బీపేట లో ఉండే వాకీ టాకీ మొబైల్ షోరూం లో సెల్ ఫోన్ మెకానిక్ గా పని చేస్తున్నాడు.

బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న మసీదులో నమాజ్ చేసుకోవడానికి రఫీ బయలుదేరాడు.

ఆ పక్కన ఉండే మూడు రోడ్ల కూడలిలో ఎల్లారెడ్డి, అనిల్, డాన్ భాష అనే ముగ్గురు వ్యక్తులు నడకుదుటి నాగరాజు అనే వ్యక్తితో గంజాయి మత్తు( Ganja )లో గొడవ పడుతు, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారు.

అటుగా వెళ్తున్న రఫీ దీన్ని చూసి ఎందుకు నాగరాజుతో గొడవ పడుతున్నారని వారితో తిరగబడ్డాడు.

గొడవ కాస్త ముదరడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో రావడంతో గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయింది.

అయితే రాత్రి పది గంటలకు రఫీ తన స్నేహితులతో కలిసి చికెన్ షాప్ వద్దకు వెళ్లాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి, అనిల్, డాన్ భాష మరికొంతమందితో ఆటో, మోటార్ సైకిల్ పై వచ్చి రఫీ( Rafi ) పై దాడికి దిగారు.

ఎల్లారెడ్డి తన వద్ద ఉండే కత్తితో రఫీ ఛాతీపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

స్నేహితులు రఫీని కానూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ లో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే రఫీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

"""/" / రఫీ తండ్రి కరిముల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు( Police Case ) నమోదు చేసుకుని గురువారం పోస్ట్ మార్టం నిర్వహించారు.

అయితే సాయంత్రం గొడవ జరిగిన సందర్భంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.బీట్ పోలీసులు ఈ ప్రదేశానికి వచ్చి ఏం జరిగిందని రఫీని విచారించారు.

అప్పుడే ఆ నిందితులను అరెస్టు చేసి ఉంటే రఫీ ప్రాణాలు నిలబడేవని స్థానికులు అంటున్నారు.

చిన్నారుల్లో ర‌క్త‌హీన‌త‌ను పోగొట్టే ఆహారాలు ఇవే..!